విశాఖ జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు
ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో అభ్యర్థుల జాబితా విడుదల..
పోస్టల్ బ్యాలెట్ లో కూటమి, వైకాపా పోటా పోటీ
విశాఖపట్నం : సూర్య
రెండో విడత సాధారణ మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు–2026లో భాగంగా జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా వెల్లడైంది. ఆనందపురం, భీమునిపట్నం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో మొత్తం 13 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు.
మండలాల వారీగా అభ్యర్థుల వివరాలు:
ఆనందపురం (4 మంది)
* నిమ్మకాయల వెంకటరావు – కాంగ్రెస్
* మజ్జి వెంకటరావు – వైఎస్సార్ కాంగ్రెస్
వెంకట ఆదిత్య కుమార్ నమ్మి – ఆమ్ ఆద్మీ పార్టీ
శ్రీనివాసరావు యెన్నీ – జనసేన
భీమునిపట్నం (3 మంది)
* అలివాని గాడు – తెలుగుదేశం
* వంపద రమావతి – వైఎస్సార్ కాంగ్రెస్
* పల్ల ఉమా మహేశ్వరి – స్వతంత్ర అభ్యర్థి
పద్మనాభం (2 మంది)
* మంజు కొరాడ – వైఎస్సార్ కాంగ్రెస్
సత్యవతి కొరాడ – తెలుగుదేశం
పెందుర్తి (4 మంది)
* అజయ్ ఏ.ఎన్. సుఖవాసి – తెలుగుదేశం
కొడిగుడ్ల దేవి సాంబమూర్తి – వైఎస్సార్ కాంగ్రెస్
* షేక్ సఫీ ఉల్లా – కాంగ్రెస్
* అరుణ్ కుమార్ కొర్రాయి – స్వతంత్ర అభ్యర్థి
మొత్తం నాలుగు మండలాల్లో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఆయా మండలాల్లో రాజకీయ పార్టీల మధ్య పోటీ నెలకొంది.