కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఏజెంట్ల నిరసన.. పోలీసుల లాఠీఛార్జ్‌పై ఆగ్రహం
ఆలూరు, సూర్య ప్రతినిధి
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కౌంటింగ్ కేంద్రానికి హాజరవుతున్న వైసీపీ ఏజెంట్లను పోలీసులు అడ్డుకోవడంతో పాటు లాఠీఛార్జ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పలువురు ఏజెంట్లు గాయపడినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన వైసీపీ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం ఎదుట నిరసనకు దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ 'పోలీసులు డౌన్ డౌన్' అంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా కౌంటింగ్ విధులకు హాజరవుతున్న తమను అడ్డుకోవడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ ఘటనతో కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
టీ ఉమాపతి హొళగుంద సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా