దీపావళి సామాగ్రి విక్రయాలకు అనుమతులు తప్పనిసరి..
దీపావళి సామాగ్రి విక్రయాలకు అనుమతులు తప్పనిసరి...
- తహశీల్దార్ బి స్వర్ణ..
- అనుమతులు లేకుండా బాణసంచా అమ్మితే కఠిన చర్యలు- హెచ్చరిక..
అన్నపురెడ్డిపల్లి, సూర్య (మేజర్ న్యూస్).
దీపావళి పండగ సందర్భంగా మండలంలో బాణసంచా, దీపావళి సామాగ్రి విక్రయాలు జరపాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని అన్నపురెడ్డిపల్లి తహశీల్దార్ బి స్వర్ణ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీపావళి పండుగ సమయంలో ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ఎలాంటి హాని జరగకూడదని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా జనావాసంలో బాణసంచా దుకాణాలు పెడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.