BREAKING
ఖనిజ అన్వేషణను వేగవంతం చేయాలి...కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే స్టేషన్లలో పండుగ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు ఆయుష్మాన్ భారత్ పథకాలపై కేంద్ర ప్రభుత్వ సమీక్ష భారతదేశంలో సెమీకండక్టర్ రంగానికి అడుగులు నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో ప్రారంభం కేంద్ర నార్కోటిక్స్ బ్యూరో 77వ వార్షికోత్సవం ఉత్తరాఖండ్ పోలీసులకు అరుదైన గౌరవం నేడే ఎంపిటిసి జడ్పిటిసి ఫలితాలు నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం -బంగారు ఆభరణాలు దొంగలించిన యువకుడి అరెస్ట్ -కోదాడ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి బడంగ్‌పేట్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లర్, మూడు షెడ్లకు సీజ్" అల్మాస్‌గూడ–గుర్రంగూడ రహదారికి మహర్దశ..!* *అభివృద్ధి పను లకు సబితమ్మ శ్రీకారం..! ఎమ్మెల్సీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్ దూకుడు..!* గిరిజన కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు కట్ట ప్రవీణ్ కుటుంబానికి 2 గుంటల స్థలం, ఇల్లు నష్టపరిహారం చెల్లించాలి కోనసీమలో విద్యుత్ సమస్యలకు కంట్రోల్ రూం నంబర్లు విడుదల

బడంగ్‌పేట్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లర్, మూడు షెడ్లకు సీజ్"

Select Suryaa Now
బడంగ్‌పేట్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లర్, మూడు షెడ్లకు సీజ్"

*అక్రమ కట్టడాలకు ఇక చుక్కలే..!*

"అక్రమ నిర్మాణదారుల గుండెల్లో గుబులు..!"

"అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ కొరడా..!"

"బడంగ్‌పేట్‌లో బహుళ అంతస్తుల భవనాల సెల్లర్, మూడు షెడ్లకు సీజ్"

"నోటీసులు బేఖాతరు చేస్తే ఉపేక్షించేది లేదు.. నిర్మాణదారులకు అధికారుల హెచ్చరిక"


:జీహెచ్‌ఎంసీ బడంగ్‌ పేట్
సర్కిల్‌-16 పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎట్టకేలకు కొరడా ఝళిపించారు. శంషాబాద్ జోనల్‌ కమిషనర్‌ ఆదేశాలు, డిప్యూటీ కమిషనర్‌ సూచనల మేరకు శుక్రవారం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు రంగంలోకి దిగి బహుళ అంతస్తుల భవనాలు, సేల్లర్లు, అనుమతులు లేని మూడు షెడ్లను సీజ్‌ చేశారు. టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీ, ఏపీ
ఎస్‌ చేంజ్‌మెంట్లతో కలిసి ఈ చర్యలు చేపట్టారు.బడంగ్‌
పేట్‌ ప్రధాన రహ
దారిపై అనుమ
తులు ఒకలా తీసు
కుని, నిర్మాణాలు మరోలా చేపడు
తున్న ఓ భవనంపై అధికారులు ప్రత్యే
కంగా దృష్టి సారిం
చారు. సెల్లర్‌తో పాటు బహుళ అంతస్తుల నిర్మాణం
లో నిబంధనలను తుంగలో తొక్కినట్లు గుర్తించి గతంలోనే నోటీసులు జారీ చేశారు.అయినప్పటికీ నిర్మాణ పనులు నిలిపివేయకుండా యథేచ్ఛగా కొనసా
గించడంతో అధికా
రులు సీరియస్‌గా స్పందించి భవనాన్ని సీజ్‌ చేశారు. అక్రమ నిర్మాణదారుల వెనుక ప్రజాప్రతి
నిధుల అండదం
డలు ఉన్నాయన్న ప్రచారాన్ని సైతం పట్టించుకోకుండా అధికారులు చర్యల
కు దిగడం చర్చనీ
యాంశమైంది.
అదేవిధంగా బడంగ్‌
పేట్‌లోని ఎస్‌బీఐ బ్యాంకు ఎదురుగా అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్లతో పాటు మార్కొటి, నాదర్‌
గుల్‌ ప్రాంతాల్లోని అక్రమ షెడ్ ను కూడా సీజ్‌ చేశారు.

*సీజ్‌ చేసినా పనులు ఆగడం లేదా..?*

మరోవైపు అధికారుల చర్యలపై కొందరు కాలనీ
వాసులు అనుమా
నాలు వ్యక్తం చేస్తున్నారు. సీజ్‌ చేసిన కొన్ని షెడ్లు, బహుళ అంతస్తుల భవనాల లోపల పనులు మాత్రం యథావిధిగా కొనసా
గుతున్నాయన్న గుసగుసలు వినిపి
స్తున్నాయి. సీజ్‌ బోర్డులు పెట్టి చేతులు దులుపు
కుంటే సరిపోదని, క్షేత్రస్థాయిలో నిరం
తర పర్యవేక్షణ ఉండాలని స్థానికులు కోరుతున్నారు.

*నోటీసులకే పరిమితమైతే లాభమేమిటి..?*

అనుమతులకు విరుద్ధంగా నిర్మాణా
లు చేపట్టేవారిపై కేవలం నోటీసులు, సీజ్‌ చర్యలతో సరిపెట్టకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవా
లని ప్రజలు డిమాం
డ్‌ చేస్తున్నారు. అధికారుల ఆదేశా
లను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు కొనసాగించే వారిపై కొరడా ఝళిపిం
చాలని, అక్రమ నిర్మాణాలకు రాజకీ
య అండ ఉన్నా ఉపేక్షించకూడదని స్పష్టం చేస్తున్నారు.
సీజ్‌ అంటే పనులు ఆగాలి.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవనే భయం నిర్మాణదారుల్లో కలగాలి. అప్పుడే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడు
తుందని కాలనీ
వాసులు అభిప్రా
యపడుతున్నారు.
---------------------------
బి. గణేష్ :బాలాపూర్ రిపోర్టర్.