అనంతగిరి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా పరిశీలకులు రోణంకి కూర్మనాధ్
అనంతగిరి నవంబరు 6 మేజర్ న్యూస్ :
రెండవ సాధారణ ఎంపీటీసీ /జడ్పీటీసీ -2026 ఎన్నికల జిల్లా పరిశీలకులు శ్రీ రోణంకి కూర్మనాథ్ ఐఏఎస్ అనంతగిరి పరిషత్ కౌంటింగ్ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు., అనంతగిరి మండలం లోని కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఆరు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి, అభ్యర్థులు మరియు వారి కౌంటింగ్ ఏజెంట్లు సమయానికి వారి యొక్క ఐడి కార్డ్స్ తో హాజరు కావాలని సూచించారు .ఎంపీటీసీ కౌంటింగ్ కోసం 14 టేబుల్స్, జడ్పీటీసీ కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .ఎప్పటికప్పుడు కౌంటింగ్ సమాచారం అందించడం కోసం ప్రత్యేకంగా మీడియా పాయింట్ ఏర్పాటు చేయడం జరిగిందని అయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల రిటర్నింగ్ అధికారి స్వామి నాయుడు ఎంపీడీవో ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.