BREAKING
ఎరుకల సామాజిక వర్గానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలి., కండెల వెంకటేశ్వర్లు, కోనేటి నరసింహ డివిజన్‌లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఉప్పలపాటి శ్రీకాంత్ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు చేతులు కాలిపోతే వెంటనే తీసుకోవాల్సిన అత్యవసర ప్రథమ చికిత్స చర్యలు ఇవే నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గాంధీ గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిపుణులు ఇస్తున్న అద్భుతమైన సలహాలు ఇవే వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్ - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ బీఆర్ఎస్ పాలనలో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్ వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు ది క్యాట్ ఇన్ ది హ్యాట్ సినిమా రివ్యూ.. వినూత్న యానిమేషన్‌తో అలరిస్తున్న హాలీవుడ్ చిత్రం బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం మానవాళి సమస్యలకు పరిష్కారాలు యువ ఆవిష్కర్తలు - మేరు ప్రావిణ్య 2026లో ప్రతిభ చాటిన విద్యార్థులు రక్తదాన శిబిరానికి విశేష స్పందన టపాసుల సరదా.. జీవితాంతం పశ్చాత్తాపం కాకూడదు

రాష్ట్ర వైద్య బృందం ఆకస్మికంగా ఏరియా ఆస్పత్రి తనిఖీ!

Select Suryaa Now
రాష్ట్ర వైద్య బృందం ఆకస్మికంగా ఏరియా ఆస్పత్రి తనిఖీ!


అరకులోయ, నవంబర్ 6, మేజర్ న్యూస్:అరకులోయ ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర స్థాయి వైద్య బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం)జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్) డి. ప్రకాశరావు,రాష్ట్ర ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎల్.దేవి, నేషనల్ హెల్త్ మిషన్ ట్రైనింగ్ కన్సల్టెంట్ ఎ. వాసుబాబులతో కూడిన ప్రత్యేక రాష్ట్ర స్థాయి వైద్య బృందం ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా శుక్రవారం సందర్శించింది.
ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి వైద్య బృంద సభ్యులు ఆసుపత్రిలోని అన్ని వార్డులు,ప్రసూతి గది, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ,స్పెషల్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ (ఎస్ ఎన్ సి యు) ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడిఎం) రిజిస్ట్రేషన్ విభాగం,ఫార్మసీ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం డీసీహెచ్ఎస్ డాక్టర్ లగుడు.రాము, ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివ బాలాజీ,అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ అప్పారావు, గైనకాలజిస్ట్ డాక్టర్ శోభారాణి,అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రియాజ్ బేగ్ రాష్ట్ర స్థాయి వైద్య బృందానికి సహకరిస్తూ ఆసుపత్రిలోని వివిధ విభాగాల పనితీరు, వైద్య సేవలు,అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేశారు.
ప్రతి విభాగంలో అందిస్తున్న వైద్య సేవలు,నిర్వహణ విధానం,పారిశుద్ధ్య పరిస్థితులు,రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వివిధ అభివృద్ధి పనుల పురోగతిని బృందం సమీక్షించింది.
ఆసుపత్రిలోని పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, విభాగాల పనితీరు, అభివృద్ధి పనుల పురోగతిపై రాష్ట్ర స్థాయి వైద్య బృందం సంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యులు,నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించింది.ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో స్థానిక ఏరియా ఆసుపత్రి  చేస్తున్న కృషిని బృందం ప్రశంసించింది.