BREAKING
ప్రధాని నరేంద్ర మోదీతో భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భేటీ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు విశాఖ ఏజెంట్‌ పై పోలీసులు పీడీ యాక్ట్ మహిళల టీ20 ట్రోఫీలో జెమిమా రోడ్రిగ్స్ సంచలన సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే శతక్కొట్టిన టీమిండియా స్టార్ యూత్ ఒలింపిక్స్‌లో తన్వీ పత్రి సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన యువ షట్లర్ పరిషత్ ఓట్ల లెక్కింపు నేడే మళ్లీ కలవనున్న భారత క్రికెట్ దిగ్గజాలు.. మరోసారి తెరపైకి రానున్న రాహుల్ ద్రవిడ్ - వీరేంద్ర సెహ్వాగ్ జోడీ! నేడే పరిషత్ ఫలితాలు.. పకడ్బందీగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు గచ్చిబౌలిలో అమెరికన్ పౌరుడి అనుమానాస్పద మృతి ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు దిశగా అడుగులు.. ఒక్కో ఆటగాడి నుంచి రూ. 40 కోట్ల భారీ డిమాండ్! పలాస, సాలూరు అభివృద్ధికి సంపూర్ణ సహకారం బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి ఎస్సై ఏడుకొండలు క్రికెట్ చరిత్రలో సంచలనం.. కేవలం 15 ఏళ్ల వయసులో బీహార్ జట్టుకు కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ! జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్న అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించిన విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం! దుండిగల్‌లో దారుణం: యువతిపై కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా అత్యాచారం

పారిశ్రామిక అభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు

Select Suryaa Now
పారిశ్రామిక అభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు

కుషాయిగూడ . నవంబర్ 6 మేజర్ న్యూస్ .చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 2 వేల పరిశ్రమలు ఉండగా, లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. చదువులు పూర్తిచేసుకుని బయటకు వస్తున్న యువతకు పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ అందించాలని సూచించారు. ఇందుకోసం పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు.

యువతకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల కొందరు మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నషా ముక్త్ భారత్ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈగల్‌ పేరుతో చర్యలు చేపడుతున్నప్పటికీ మాదకద్రవ్యాల సరఫరాను పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. పాఠశాలలు, కళాశాలల్లోనూ మాదకద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమానికి పూర్తి మద్దతు అందిస్తోందని, ఈ నేపథ్యంలో చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణ అవకాశాలు కల్పించడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని ఈటల రాజేందర్ సూచించారు.