BREAKING
నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం దీపావళి పండుగ వెనుక ఉన్న అసలు చారిత్రక కథ ఏమిటి.. టపాసులు ఎందుకు కాలుస్తారు ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకే వినియోగించాలి ఎరుకల సామాజిక వర్గానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలి., కండెల వెంకటేశ్వర్లు, కోనేటి నరసింహ డివిజన్‌లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఉప్పలపాటి శ్రీకాంత్ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు చేతులు కాలిపోతే వెంటనే తీసుకోవాల్సిన అత్యవసర ప్రథమ చికిత్స చర్యలు ఇవే నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గాంధీ గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిపుణులు ఇస్తున్న అద్భుతమైన సలహాలు ఇవే వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్ - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ బీఆర్ఎస్ పాలనలో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్ వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు ది క్యాట్ ఇన్ ది హ్యాట్ సినిమా రివ్యూ.. వినూత్న యానిమేషన్‌తో అలరిస్తున్న హాలీవుడ్ చిత్రం బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

విశాఖ ఏజెంట్‌ పై పోలీసులు పీడీ యాక్ట్

Select Suryaa Now
విశాఖ ఏజెంట్‌ పై  పోలీసులు పీడీ యాక్ట్

డేటా ఎంట్రీ ఉద్యోగాల ముసుగులో సైబర్ నేరాల ఉచ్చు

౼ రూ.2 లక్షలకు యువతను విదేశాలకు అమ్మకం

౼ కంబోడియా సైబర్ ముఠాలతో లింకులు!

విశాఖపట్నం :సూర్య

విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగ యువతకు గాలం..లక్షల్లో జీతాల ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షలు వసూలు..తీరా కంబోడియా చేరాక సైబర్ మోసాలే పని! ఉద్యోగాల పేరుతో యువత జీవితాలను సైబర్ నేరాల ఊబిలోకి నెట్టిన గాజువాకకు చెందిన ప్రధాన ఏజెంట్ చుక్క రాజేష్ వినయ్ కుమార్‌పై విశాఖ నగర పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. పునరావృతంగా సైబర్ నేరాలకు యువతను ప్రోత్సహిస్తూ ప్రజల ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాడన్న కారణంతో పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు.దీంతో నిందితుడిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.విశాఖ నగర కేంద్రంగా గాజువాకకు చెందిన చుక్క రాజేష్ వినయ్ కుమార్ అనే వ్యక్తి ఇన్స్టిట్యూట్ నడుపుతూ దాని పేరిట కంబోడియా ఏజెంట్లకు నిరుద్యోగ యువతను సైబర్ స్కామ్స్ చేసే కంపెనీలకు పంపించడం కొన్నేలుగా జరుగుతుందని పోలీసులు తెలిపారు. వివిధ జిల్లాలకి కు చెందిన ఒక్కొక్క యువకుడిని కంప్యూటర్ డేటా ఎంట్రీ అనే ఉద్యోగం పేరిట రూ.2 లక్షలు రూపాయలు తీసుకొని పంపించడం జరిగిందని అన్నారు.అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇండియాకి వ్యతిరేకంగా సైబర్ స్కామ్స్ చేయమని టార్చర్ చేస్తూ, ఇబ్బందులకు గురిచేస్తునారనే అనే విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీస్ ను ఆశ్రయించిన వారి ద్వారా తెలిసిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి చుక్క రాజేష్ వినయ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు.అలాగే తనని విచారించంగా, తను ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతూ దాని ద్వారా ఇతర దేశాలకు ఉద్యోగం కోసం యువకులను పంపిస్తున్నట్లు అంగీకరించాడని పేర్కొన్నారు.
కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం కంబోడియా 
లో ఉన్నాయని  చెప్పి అక్కడికి వెళ్ళే నిరుద్యోగుల వద్ద నగదు రూపం లో గాని లేదా ఫోన్ పే ద్వారా గాని అమౌంట్ తీసుకుంటాడని తెలియజేసారు. తను తీసుకొన్న అమౌంట్ ద్వారా ఫ్లైట్ టికెట్స్ తీసి,1000 దాలర్లకు అభ్యర్థి  పేరు మీద కరెన్సీ ఎక్స్చేంజ్  చేసి వారికి ఇస్తాడని అన్నారు. కొన్ని సార్లు కంబోడియాలో ఉన్న ఏజెంట్స్ టికెట్స్ , ఈ వీసా  ను పంపిస్తారని చెప్పారు. కంబోడియా లో ఉన్న ఏజెంట్లు 150 డాలర్ల  వరకు నగదు పే చేసి ఈ వీసా  ను పొంది, తనను పంపిస్తారని వెల్లడించారు.తను వెంటనే టికెట్స్ తీసి అభ్యర్థులను కంబోడియాలో ఉన్న ఏజెంట్ల వద్దకు పంపిస్తాడని, ఆ ఏజెంట్లు తను పంపించిన నిరుద్యోగులను కంబోడియా లో గల స్కామ్స్ కంపెనీ ల వద్ద కొంత డబ్బు తీసుకొని వారిని అమ్మివేస్తారని పేర్కొన్నారు. నిరుద్యోగులను కంబోడియా పంపించి సైబర్ స్కామ్స్ చేయడానికి తోడ్పడిన ప్రధాన ఏజెంట్ అయిన  చుక్క రాజేష్ వినయ్ కుమార్ ను పీడీ  అనుగుణంగా చట్టపరమైన విధానాన్ని అనుసరించి అదుపులోకి తీసుకొని, విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు.

 యువత అప్రమత్తంగా ఉండాలి

ఇటువంటి ఏజెంట్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేస్తున్నారు. ఎవరు కూడా మయన్మార్, కంబోడియా, వియత్నాం, లాఓస్ వంటి ఆగ్నేయ దేశాలకు వెళ్లి భారతదేశానికి వ్యతిరేకంగా స్కామ్ ఉద్యోగాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా స్కామ్ ఉద్యోగాలు చేయడానికి వెళ్తే, వారి పై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు.