BREAKING
నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటాం దీపావళి పండుగ వెనుక ఉన్న అసలు చారిత్రక కథ ఏమిటి.. టపాసులు ఎందుకు కాలుస్తారు ప్రభుత్వ భూములు ప్రజా అవసరాలకే వినియోగించాలి ఎరుకల సామాజిక వర్గానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలి., కండెల వెంకటేశ్వర్లు, కోనేటి నరసింహ డివిజన్‌లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఉప్పలపాటి శ్రీకాంత్ దీపావళి టపాసులు కాల్చేటప్పుడు చేతులు కాలిపోతే వెంటనే తీసుకోవాల్సిన అత్యవసర ప్రథమ చికిత్స చర్యలు ఇవే నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గాంధీ గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిపుణులు ఇస్తున్న అద్భుతమైన సలహాలు ఇవే వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్ - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ బీఆర్ఎస్ పాలనలో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్ వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు ది క్యాట్ ఇన్ ది హ్యాట్ సినిమా రివ్యూ.. వినూత్న యానిమేషన్‌తో అలరిస్తున్న హాలీవుడ్ చిత్రం బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

పరిషత్ ఓట్ల లెక్కింపు నేడే

Select Suryaa Now
పరిషత్ ఓట్ల లెక్కింపు నేడే

 

శనివారం ఉదయం 8 నుంచి ప్రారంభం

నాలుగు నియోజకవర్గాల్లోని 15 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

పార్వతీపురం నవంబర్ 06 మేజర్ న్యూస్ : జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం మరియు పోలీసు శాఖ సమగ్ర ప్రణాళికతో పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశాయి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా ఎన్ ప్రభాకర రెడ్డి పర్యవేక్షణలో కౌంటింగ్ నిర్వహణకు సిద్ధమైంది.

​నవంబర్ 7న జరగనున్న ఈ ఓట్ల లెక్కింపు కోసం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 15 మండలాలకు సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లో 15 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరగనుంది.

నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపుకేంద్రాల వివరాలు

పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి పార్వతీపురం, సీతానగరం,  బలిజిపేట మండలాల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగునుంది
                         పాలకొండ నియోజకవర్గానికి సంబంధించి పాలకొండ, వీరఘట్టం, భామిని, సీతంపేట మండలాల ఓట్ల లెక్కింపు కార్యక్రమం పాలకొండ డిగ్రీ కళాశాల ఫస్ట్ బ్లాక్లో జరగనుంది.
సాలూరు నియోజకవర్గానికి సంబంధించి సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో జరగనున్నది*
                   కురుపాం నియోజకవర్గానికి సంబంధించి కురుపాం, జి ఎల్ పురం, జిఎం వలస, గరుగుబిల్లి, కొమరాడ మండలాల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉల్లి భద్ర దరి ఉద్యాన కళాశాలలో జరుగనున్నది.

​​భారీ పోలీసు భద్రత & బందోబస్తు:

కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తును రంగంలోకి దించింది. నాలుగు నియోజకవర్గాల స్థాయి కౌంటింగ్ కేంద్రాల వద్ద  382 మంది పోలీస్లు విధులు నిర్వహిస్తున్నారు.  04 డీఎస్పీలు, 16 మంది సీఐ/ఆర్ఐ లు, 20 మంది ఎస్ఐలు, 219 మంది కానిస్టేబుళ్లు, మరియు 123 హోం గార్డ్ సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలోని సంబంధిత పోలీసు స్టేషన్ల ద్వారా మూడంచెల భద్రతా చర్యలు చేపడుతున్నారు. అధికారులు మరియు సిబ్బంది సమన్వయంతో శనివారం ఉదయం నుంచే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.