BREAKING
నడిగడ్డ తండా సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గాంధీ గ్రాడ్యుయేట్ల ఓట్ల నమోదు పై దృష్టి పెట్టండి: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. నిపుణులు ఇస్తున్న అద్భుతమైన సలహాలు ఇవే వుషు ప్రదర్శనల్లో " గులామ్ ముస్తఫా ఖాన్ " టాప్ - కనెక్టికట్ సాంస్కృతిక ఉత్సవాల్లో తనదైన ప్రతిభ బీఆర్ఎస్ పాలనలో బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం :మోత రోహిత్ ముదిరాజ్ డిమాండ్ వాడపల్లి, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రలు ది క్యాట్ ఇన్ ది హ్యాట్ సినిమా రివ్యూ.. వినూత్న యానిమేషన్‌తో అలరిస్తున్న హాలీవుడ్ చిత్రం బియ్యం అక్రమ నిల్వలు, తూకాల్లో మోసాలపై రాష్ట్రవ్యాప్త దాడులు జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం మానవాళి సమస్యలకు పరిష్కారాలు యువ ఆవిష్కర్తలు - మేరు ప్రావిణ్య 2026లో ప్రతిభ చాటిన విద్యార్థులు రక్తదాన శిబిరానికి విశేష స్పందన టపాసుల సరదా.. జీవితాంతం పశ్చాత్తాపం కాకూడదు మెడ నొప్పి నుంచి చేతివేళ్ల తిమ్మిర్ల వరకు.. సర్వైకల్ సమస్యలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోండిలా పర్యావరణ హితమైన దీపావళిని జరుపుకుందాం రాజయోగి డా.చిక్కా దేవదాసు ఏఎన్ఆర్ఎఫ్ పెయిర్ హబ్ బృందం పర్యటన

గచ్చిబౌలిలో అమెరికన్ పౌరుడి అనుమానాస్పద మృతి

Select Suryaa Now
గచ్చిబౌలిలో అమెరికన్ పౌరుడి అనుమానాస్పద మృతి

 హైదరాబాద్:నగరంలోని ప్రముఖ ఐటీ కారిడార్ గచ్చిబౌలి పరిధిలో ఒక అమెరికన్ పౌరుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

మృతుడిని అమెరికాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41)గా పోలీసులు గుర్తించారు. వ్యాపార సంబంధిత పనుల నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన మిచెల్, గచ్చిబౌలిలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్‌లో బస చేశారు. ఈ క్రమంలో ఆయన తన గదిలోనే మృతి చెంది ఉండటాన్ని గమనించిన హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. మిచెల్ మృతికి సంబంధించి అమెరికన్ ఎంబసీకి మరియు ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం అందించారు.