పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు
కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి
కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులతో సమీక్ష.
అనంతగిరిలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణాలను వేగవంతం చేయాలి.
కోదాడలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, డివిజన్ కార్యాలయా లు పూర్తి చేయాలి.
షాదీఖానా, ఈద్గా, న్యాక్ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం.
కోదాడ (మేజర్ న్యూస్)కోదాడ నియోజకవర్గంలో చేపట్టిన రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న రహదారులు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల పనుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
52 కోట్ల నూతన రహదారి పనులకు వెంటనే టెండర్లు పిలవాలి అని ఆదేశించారు.
కోదాడ నియోజకవర్గంలో రహదారి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు నూతన ఆర్‌అండ్‌బీ రహదారుల నిర్మాణానికి 52 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి వెల్లడించారు.
మంజూరైన రహదారి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను త్వరితగతిన చేపట్టి, పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.ఇప్పటికే నిర్మాణంలో ఉన్న రహదారులు, వంతెనల పనుల్లో వేగం పెంచాలని, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
అనంతగిరిలో ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలి అని,అనంతగిరి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్ భవనాల నిర్మాణ పనుల ను పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సౌకర్యవంతంగా అందించేందుకు ఈ భవనాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.
కోదాడలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, డివిజన్ కార్యాలయాల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి__________
కోదాడ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, డివిజన్ కార్యాలయ భవనాల నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ప్రభుత్వ భవనాల నిర్మాణంలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్మాణ పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
పనుల్లో అనవసర జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
షాదీఖానా, ఈద్గా, న్యాక్ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలి
_________________
నియోజకవర్గ పరిధిలో చేపట్టిన షాదీఖానా, ఈద్గా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా నిర్మాణంలో ఉన్న న్యాక్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సమీక్షా సమావేశంలో ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది, సంబంధిత కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.