BREAKING
ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం గరివిడి జడ్పిటీసి గా బొత్స పూజిత విజయం జిల్లాలో మొట్టమొదటి సారిగా వికసించిన కమలం " మెలియాపుట్టిలో టీడీపీ విజయదుందుభి ఒకే ఇంట్లో రెండు జెండాలు.. సైకిల్ స్పీడ్ కు బ్రేకు వెయ్యలేకపోయిన వైసిపి కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమిదే పై చేయి అనందపురం మండలంలో టీడీపీ జయకేతనం

క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి

Select Suryaa Now
క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి

క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలని డిమాండ్ : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సమాఖ్య
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;దాదాపు పది రోజుల కిందట చనిపోయిన క్రెడిట్ సొసైటీ మేనేజర్ గొర్తిశ్రీనివాసరావు మృతిపై విచారణ  జరపాలనిఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షులు  వెంకట రామరాజు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ లో సీనియర్ అకౌంట్స్ మేనేజర్ గా రాజమండ్రి ఇన్చార్జి మేనేజర్ గా తిరుపతి ఇన్చార్జి మేనేజర్ గా పనిచేస్తున్న గొ ర్తి శ్రీనివాసరావు పోయిన నెల 28వ తేదీన గోదారి నదిలో దూక డం జరిగిందని ఇప్పటివరకు అతని మృతదేహాన్ని లేదా ఆచూకిని తెలుసుకోలేకపోవడం బాధాకరమని ,పట్టించుకోకపోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు గోదావరి నదిలోకి దూకే ముందుగా సెల్ఫోన్లో మరణ వాంగ్మూలం  మాదిరి ఒక నోటు పెట్టి కుటుంబ సభ్యులకు కొన్ని బ్రాహ్మణ సంఘాలకు పంపడం జరిగిందన్నారు. ఆ మెసేజ్ లో తన మృతికి నలుగురు కారుకులని వారి పేర్లను కూడా పేర్కొన్నా రన్నారు. అయితే పోలీస్ శాఖ కేసు నమోదు చేసింది గాని ఇంతవరకు ఆ నలుగురిని ప్రశ్నించారా లేదన్నది కూడా తెలియడం లేదని ఆయనఆరోపించారు. క్రెడిట్ సొసైటీలో అవినీతి జరుగుతున్నదని ఎన్నోసార్లు చైర్మన్ దృష్టికి తీసుకొని పోయిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఇప్పుడు జరిగిన అవినీతిని అంతా ఒక వ్యక్తిపై మోపడం బాధాకరమని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1 కోటి 90 లక్షలు అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి అని వారు పేర్కొన్నారు. చిన్న సంఘటన జరిగినా ప్రతిరోజు విచారణ జరిపి పత్రికలలో ప్రచురిస్తున్న పోలీస్ శాఖ ఈ కేసు విషయమై ఎందుకు వివరాలు తెలపడం లేదని వారు ప్రశ్నించారు తప్పు జరిగితే అరెస్టు చేసి రికవరీ చేసుకోవాలి గానీ ఉద్యోగిపై దాడి చేసే హక్కు సొసైటీ. ఉన్నతాధికారులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు సూసైడ్ నోట్లో ఉన్న నలుగురు వ్యక్తులను ఆయా పదవుల నుండి సస్పెండ్ చేసి ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరారు.బ్రాహ్మణ సమాజంలో ఏర్పడిన అనుమానాలను నివృత్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై మెజిస్ట్రేట్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారని వెంకటరామరాజు  విజ్ఞప్తి చేశారు.

కరణం శ్రీనివాసరావు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా