BREAKING
కాల్పుల ఘటన తర్వాత టైగర్ ష్రాఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు: విద్యుత్ జమ్వాల్ కీలక వ్యాఖ్యలు! పారిశ్రామిక అభివృద్ధితోనే యువతకు ఉపాధి అవకాశాలు ఎరుకల సామాజిక వర్గానికి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి కేటాయించాలి., కండెల వెంకటేశ్వర్లు, కోనేటి నరసింహ అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలపై దేలెర్ మెహందీ కుమారుడు గుర్దీప్ కౌంటర్.. అసలేం జరిగిందంటే! నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై క్షేత్రస్థాయి పరిశీలన రెండు దశాబ్దాల తర్వాత ఆ పాత టైటిల్‌ను రిపీట్ చేస్తున్న విశ్వనటుడు కమల్ హాసన్.. సాండియార్ ఫస్ట్ లుక్ విడుదల! షో నుంచి భయపడి పారిపోయిన తేజ్ ప్రతాప్ యాదవ్.. షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు! ప్రమాదాల నివారణే ‘మిషన్ ట్రిపుల్ ఆర్’ లక్ష్యం చిన్నారుల సందడితో నవోదయ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ వేడుకలు 1 మాతృభూమి సినిమాపై వస్తున్న వార్తలను కొట్టిపారేసిన సల్మాన్ ఖాన్.. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ! వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ షాక్ మా హయాంలో చరిత్రలో నిలిచిపోయే నీటిపారుదల పనులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మనసును హత్తుకునేలా మనోజ్ వాజ్ పేయ్ 'దిల్వాలి దివాలి' మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా! బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక :

రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు

Select Suryaa Now
రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు
మేడ్చల్, మేజర్ న్యూస్: గుండ్లపోచంపల్లి నుంచి అయోధ్య వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ మార్గంలోని రైల్వే గేటు వద్ద రైళ్ల రాకపోకల సమయంలో గేటు మూసివేయడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. గేటు తెరుచుకునే వరకు వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి తోడు రైల్వే గేటు సమస్య తోడవడంతో ప్రయాణికులు నిత్యం ట్రాఫిక్ చిక్కుల్లో పడుతున్నారు.రైలు రాకపోకల సమయంలో ప్రతిసారీ గేటు మూసివేయడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. దీంతో రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు, నిత్యం ఈ మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పనులపై వెళ్లేవారు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుని సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. ప్రయాణ సమయం వృథా కావడంతో పాటు వాహనదారుల సహనానికి ఈ పరిస్థితి పరీక్షగా మారుతోంది.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ పనులు నత్తనడకన సాగుతుండటంపై స్థానికులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యతో ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నా నిర్మాణ పనుల్లో ఆశించిన వేగం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే రైల్వే గేటు వద్ద ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.