BREAKING
అంతర్జాతీయ వేదికపై చరిత్ర సృష్టించిన విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం! దుండిగల్‌లో దారుణం: యువతిపై కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా అత్యాచారం రామాయణంపై బడ్జెట్, వీఎఫ్ఎక్స్ చర్చలు సరికావు.. రాముడు, సీత గురించే మాట్లాడాలి: సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న ధనుష్, వెట్రిమారన్ క్రైమ్ థ్రిల్లర్.. రికార్డులను బ్రేక్ చేస్తున్న 'వడ చెన్నై'! అప్పన్న దర్శనానికి సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి ధరల మంటలో చిద్రమవుతున్న పేదోడి బతుకులు ఓటీటీని షేక్ చేస్తున్న వరుణ్ సందేశ్ క్రైమ్ థ్రిల్లర్.. వంద మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలు దాటిన 'నా వైఫ్ మిస్సింగ్'! దుర్గి : బాణసంచా దుకాణాలకు అనుమతులు తప్పనిసరి - దుర్గి ఎస్ఐ బి.గోపాల్ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ప్రత్యేక భద్రత! రాష్ట్ర వైద్య బృందం ఆకస్మికంగా ఏరియా ఆస్పత్రి తనిఖీ! అనంతగిరి కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా పరిశీలకులు రోణంకి కూర్మనాధ్ దీపావళి వేడుకల్లో భద్రతే ముఖ్యం! ఓటీటీలోకి వస్తోన్న సంచలన భక్తి చిత్రాలు.. సోనీ లివ్‌లో 'హనుమాన్ అంశ్' స్ట్రీమింగ్ డేట్ ఖరారు! మహిళా సమైక్య భవనానికి భూమి పూజ : నవపూర్ అడ్వాన్స్‌డ్ సైన్సెస్ పరిశ్రమలో ప్రమాదం

మా హయాంలో చరిత్రలో నిలిచిపోయే నీటిపారుదల పనులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Select Suryaa Now
మా హయాంలో చరిత్రలో నిలిచిపోయే నీటిపారుదల పనులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

 

*తుంగపహాడ్ వద్ద 33 కోట్ల వ్యయంతో నిర్మించిన 560 రెండు పడక గదుల ఇండ్ల ప్రారంభం

మిర్యాలగూడ,మేజర్ న్యూస్:

తమ ప్రభుత్వ హయాంలో చరిత్రలో నిలబడిపోయే నీటిపారుదల పనులు చేపడుతున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫ రాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శుక్రవారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణం సమీపంలోని తుంగపహాడ్ వద్ద 33 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 560 రెండు పడక గదులఇండ్లనుప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ తమ 5 సంవత్సరాల పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటిపారుదల పథకాల విషయంలో స్వర్ణ యుగంగా మిగిలిపోతుందన్నారు. తమ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ పథకాలన్నింటినీ పూర్తి చేస్తామని, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల కు సాగు నీరు అందించే దిండి ఎత్తిపోతల పథకం పనులు వేగవంతం చేస్తామని, మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తుమ్మిడిహట్టి పథకం పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్న ఆశా భావాన్ని మంత్రి వ్యక్తం చేశారు.జిల్లాలోని బస్వాపూర్, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి, తోపుచర్ల, కేశవాపూర్, కొండ్రపోలు, దున్నపోతుల గండి ఎత్తి పోతల పథకం పనులు పూర్తి చేస్తామన్నారు.
దామరచర్ల మండలం శాంతి నగర్, రావులపెంట వాగులపై ఒక్కొక్కటి 9 కోట్ల రూపాయల వ్యయంతో చిన్న ఆనకట్టలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వజీరాబాద్ ప్రధాన కాలువ పనులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన సన్న బియ్యం ఇస్తున్నామని, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

*పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నాం - శాసనమండలి చైర్మన్ గుత్తా :*

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడంలో భాగంగా రాష్ట్రంలో గత 3 సంవత్సరాలలో మొదటి విడత 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందని, రెండవ విడత కూడా ప్రారంభించడం జరిగిందన్నారు.జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన 3600 రెండు పడక గదుల ఇండ్లలో అసంపూర్తిగా మిగిలిపోయిన 1000 ఇండ్లను పూర్తి చేసి పేదలకు ఇవ్వాలని జిల్లా పాలనాధికారితో కోరారు. శ్రీశైలం ఎడమ కాలువ పూర్తయితే గురుత్వాకర్షణపై నీళ్లు ఇవ్వవచ్చన్నారు. నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎత్తిపోతల పథకాలు పూర్తి చేయాలని కోరారు.

*అర్హులందరికీ విడతల వారీగా ఇండ్లు: ఎంపీ రఘువీర్ రెడ్డి*
నల్గొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండు పడక గదుల ఇండ్లు రానివారు నిరాశ పడవద్దని, విడతల వారీగా అర్హులందరికీ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని, వచ్చే విడతలో మిర్యాలగూడ పురపాలక సంఘ పరిధిలో పెద్ద ఎత్తున భారీ ఇందిరమ్మ ఇండ్ల కాలనీ చేపట్టి అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.తుంగపహాడ్ రెండు పడక గదుల ఇండ్ల కాలనీలో తన పార్లమెంటు సభ్యుల నిధుల నుండి గ్రంథాలయం, బహిరంగ వ్యాయామశాలను మంజూరు చేస్తున్నట్లు పార్లమెంటు సభ్యుడు ప్రకటించారు. అలాగే దామరచర్ల - రాజాపేట కింద వంతెన మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు.

*అన్ని సౌకర్యాలతో కాలనీ :జిల్లా కలెక్టర్ :*

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ 7 ఎకరాల 24 గుంటల స్థలంలో 24 బ్లాకుల్లో 560 ఇండ్లను మిర్యాలగూడ సమీపంలోని తుంగపహాడ్ వద్ద నిర్మించి పేదలకు ఇవ్వడంతో వారి సొంత ఇంటి కల నెరవేరిందని అన్నారు.
నూతనంగా ప్రారంభించిన రెండు పడక గదుల ఇండ్ల కాలనీలో అంతర్గత రహదారులు, మురుగు కాలువ, తాగునీరు, పార్కు, విద్యుత్తు, దేవాలయం వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయని, పేద ప్రజలకు కావలసిన సౌకర్యాలతో పూర్తిస్థాయిలో కాలనీని ఏర్పాటు చేశామన్నారు.
సుమారు 33 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ కాలనీకి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసామని తెలిపారు. రెండు పడక గదుల ఇండ్ల కాలనీ ప్రారంభంతో పాటు మిర్యాలగూడలో ఉప నమోదు కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని తెలిపారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, శాసనమండలి సభ్యుడు శంకర్ నాయక్, జిల్లా పోలీసు అధీక్షకుడు శరత్ చంద్ర పవార్, రెవెన్యూ అదనపు పాలనాధికారి జె. శ్రీనివాస్, గృహనిర్మాణ శాఖ పథక సంచాలకుడు లోకి లాల్, జిల్లా పథకాల ప్రధాన అభియంత శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ ఉప విభాగ అధికారి రమణారెడ్డి, స్థానిక పురపాలక సంఘ అధ్యక్షురాలు చిలుకూరి సుధా బాలకృష్ణ, సర్పంచి గోవింద్, పురపాలక సంఘ ఉపాధ్యక్షురాలు గుడిపాటి శిరీష, విభాగ, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం మంత్రులు, శాసనమండలి అధ్యక్షుడు లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపు ఉత్తర్వులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి గోడ పత్రికను ఆవిష్కరించారు.