BREAKING
రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..? ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు అఫ్గానిస్తాన్‌తో తొలి టెస్టు: భారీ స్కోరు సాధించిన జింబాబ్వే.. భారీ ఆధిక్యంలో పర్యాటక జట్టు! బ్రిటన్ చిన్నారుల కోసం 'ఫైండ్ ఫ్రెండ్స్' ఫీచర్‌ను డిసేబుల్ చేసిన స్నాప్‌చాట్ అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఘన విజయం.. యూఏఈపై 9 వికెట్ల తేడాతో భారీ గెలుపు! శిలాజ ఇంధనాల కోత మరియు క్లైమేట్ ఫైనాన్స్‌పై ఉత్కంఠ సరికొత్త చరిత్ర సృష్టించిన హసన్ మహమూద్.. తొలి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు! నవంబర్‌లో మెరుగుపడిన యూఎస్ వినియోగదారుల సెంటిమెంట్ దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ 'బ్లాక్‌లిఫ్ట్' రాకెట్ కోసం ఫైర్‌ఫ్లైతో 1.3 బిలియన్ డాలర్ల డీల్ పాంచజన్య పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు

ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు.. జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ సంజయ్‌ జాజు ఆదేశం

Select Suryaa Now
ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు.. జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ సంజయ్‌ జాజు ఆదేశం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పథకాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. శుక్రవారం సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ ప్రభుత్వ శాఖల కార్యక్రమాల పురోగతి, అభివృద్ధి పనుల అమలు, సంక్షేమ పథకాల తీరుపై ఆయన సమీక్షించారు.ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సీఎస్‌ సూచించారు. రాష్ట్రంలోని 565 మండలాల్లో నీటి లభ్యతను అంచనా వేసి, అవసరమైన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద 2027 మార్చి నాటికి 11 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫామ్‌ పాండ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేసి నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.చేయూత పింఛన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నవంబర్‌ రెండో వారంలోగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రెండు విడతల్లో మంజూరైన 3.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించాలని తెలిపారు. వివిధ అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించాలని, ప్రజల సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సంజయ్‌ జాజు సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులకు చేరేలా బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ మిక్కిలినేని మను చౌదరి, అదనపు కలెక్టర్‌ డి. విజయేందర్‌రెడ్డి, డీఈఓ రేణుకాదేవి, డీఆర్‌డీఓ సాంబశివరావు తదితర అధికారులు పాల్గొన్నారు.