పాంచజన్య పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు
హిందూపురం :- స్థానిక పట్టణంలోని పాంచజన్య పాఠశాల ప్రాంగణంలో అధ్యక్షులు డా. పి.ఎస్. శ్రీనివాసులు, కరస్పాండెంట్ డి.ఎస్. నందకుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తు దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యార్థుల ఉత్సాహం మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించడమే నిజమైన దీపావళి అని అన్నారు. దీపావళి పండుగను పర్యావరణానికి హాని కలిగించకుండా జరుపుకోవాలని కోరారు. గ్రీన్ క్రాకర్స్ సాధారణ టపాసుల కంటే తక్కువ కాలుష్యం కలిగించేవే అయినా, పూర్తిగా కాలుష్యరహితం కాదని గుర్తించాలి.చిన్న పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు పేల్చాలని, కాటన్ దుస్తులు ధరించి సురక్షిత దూరంలో ఉండాలని సూచించారు. దీపాలను ఎక్కువగా వెలిగించి, టపాసుల వాడకాన్ని తగ్గించి శబ్ద, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని గాయత్రి, ఎ.ఒ. భాస్కర్, సూపరింటెండెంట్ విజయీంద్ర, ఎ.హెచ్.ఎం.లు శశికళ, సతీష్ కుమార్, షేక్ అబ్దుల్ రజాక్ తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హిందూపురం సూర్య స్టాఫ్ రిపోర్టర్ నాగేంద్ర