BREAKING
క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు అఫ్గానిస్తాన్‌తో తొలి టెస్టు: భారీ స్కోరు సాధించిన జింబాబ్వే.. భారీ ఆధిక్యంలో పర్యాటక జట్టు! బ్రిటన్ చిన్నారుల కోసం 'ఫైండ్ ఫ్రెండ్స్' ఫీచర్‌ను డిసేబుల్ చేసిన స్నాప్‌చాట్ అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఘన విజయం.. యూఏఈపై 9 వికెట్ల తేడాతో భారీ గెలుపు! శిలాజ ఇంధనాల కోత మరియు క్లైమేట్ ఫైనాన్స్‌పై ఉత్కంఠ సరికొత్త చరిత్ర సృష్టించిన హసన్ మహమూద్.. తొలి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు! నవంబర్‌లో మెరుగుపడిన యూఎస్ వినియోగదారుల సెంటిమెంట్ దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ 'బ్లాక్‌లిఫ్ట్' రాకెట్ కోసం ఫైర్‌ఫ్లైతో 1.3 బిలియన్ డాలర్ల డీల్ పాంచజన్య పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు మొదలైన యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి సందడి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిశ్చితార్థ ఆహ్వానం! యూరప్ స్టెయిన్‌లెస్ స్టీల్ రంగం కోలుకోవడం 2027కి వాయిదా అక్టోబర్‌లో పుంజుకున్న కెనడా ఐవే పీఎంఐ సూచీ అయోధ్య దీపోత్సవ్‌కు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్

Select Suryaa Now
షేర్ మొహమ్మద్ పేట లో సర్పంచ్ ఎలక్షన్ హీట్

అనూహ్యంగా సర్పంచ్ రేసులోకి షేక్ సైదా (కొట్టు సైదా)..!

సర్పంచ్ అభ్యర్థి సైదా అయితే గెలుపు కాయమంటున్న స్థానికులు …

సైదా పేరుని పరిశీలిస్తున్న హైకమాండ్.…

ప్రజాదారణ మెండుగా ఉన్న సైదా.…

జగ్గయ్యపేట నవంబర్ 6 రూరల్ మేజర్ న్యూస్:

షేర్ మహమ్మద్ పేటలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన సైదా అభ్యర్థిత్వంపై గ్రామంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికల రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా సర్పంచ్ రేసులో షేక్ జాన్ సైదా (కొట్టు సైదా) పేరు తెరపైకి రావడంతో గ్రామ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న  సైదాకు గ్రామ ప్రజల్లో మంచి ఆదరణ ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, పేదలకు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారని గ్రామస్తులు చెబుతున్నారు.

గ్రామంలోని వివిధ వర్గాల నుంచి సైదాకు పూర్తి మద్దతు లభిస్తోందని, ఆయన అనుచరులు సుమారు 1,200 నుంచి 1,500 ఓట్ల వరకు ప్రభావితం చేయగలరని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సైదా పేరును కూడా పార్టీ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

నాలుగు దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న జాన్ సైదాకు ఈసారి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని గ్రామంలోని పలువురు స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నట్లు తెలుస్తోంది. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి ప్రస్తుతం షేర్ మహమ్మద్ పేట రాజకీయ వర్గాల్లో నెలకొంది.

అనూహ్యంగా తెరపైకి వచ్చిన కొట్టు సైదా పేరు రాబోయే రోజుల్లో గ్రామ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో వేచి చూడాలి.

 

 

 

రిపోర్టర్ :-శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా