దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
సూర్య, జన్నారం : జన్నారం మండలం రాయికుంట గ్రామంలో ఆదివాసీలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో శుక్రవారం సాయంత్రం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని వీక్షించారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ దోతి పంచ కట్టుకొని అందరితో కలిసి వీక్షిస్తుండడంతో ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా బొజ్జు పటేల్ మాట్లాడుతూ దండారి, గుస్సాడీ నృత్యాలు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలన్నారు. మన సంస్కృతి, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించాలన్నారు. రాయికుంట గ్రామస్తులతో కలిసి కొద్దిసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దండారి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందని, మునుముందు రోజుల్లో ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీర నందు నాయక్, మాజీ జెడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సయ్యద్ ఫసియుల్లా, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు కుదిరె వెంకన్న, కవ్వాల్ సర్పంచ్ సక్రు నాయక్, కాంగ్రెస్ నాయకులు ముత్యం రాజన్న, మంద రాజేష్, షాకీర్, ముజ్జు తదితరులు ఉన్నారు.