షాద్ నగర్ మున్సిపాలిటీలో జోరుగా ఇంటి పన్నుల వసూలు...
7వ వార్డులో పర్యటించిన ఆర్ఓ సీతానాయక్…
సకాలంలో పన్నులు చెల్లించాలని ఇంటి యజమానులకు వినతి…
షాద్ నగర్, రంగారెడ్డి:
షాద్ నగర్ మున్సిపాలిటీలో ఇంటి పన్నుల వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. ఆయా వార్డుల్లో మున్సిపల్ సిబ్బంది వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు ఇంటి పన్నుల వసూళ్లలో బిజీగా ఉన్నారు. శుక్రవారం మున్సిపాలిటీలోని 7వ వార్డులో సిబ్బంది పనితీరును మున్సిపల్ ఆర్ఓ సీతానాయక్, ఆర్ఐ రమేష్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా సీతా నాయక్ మాట్లాడుతూ సకాలంలో పన్నులు చెల్లింపుపై సిబ్బంది దృష్టి సారించాలని, యజమానులు తమ ఇంటి పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యం చెయ్యరాదని, బాధ్యతగా పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్ బాబు, బిల్ కలెక్టర్ నరేష్ లు పాల్గొన్నారు.
నరసింహ రెడ్డి మేజర్ న్యూస్…