వాతావరణ మార్పులపై రెండు రోజుల జాతీయ సదస్సు
పటాన్‌చెరు;పటాన్‌చెరు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. వాతావరణ అంశాలు, విధానం, శాస్త్రం మరియు మానవాళి భవిష్యత్తు అనే అంశంపై ఐసీఎస్ఎస్ఆర్, రూసా నిధులతో ఈ సదస్సును నిర్వహించారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్, జాతీయ సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ ఎం. ప్రవీణ తెలిపారు.రెండు రోజుల పాటు నిర్వహించిన సదస్సులో మూడు సాంకేతిక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, వాటి తీవ్ర ప్రభావాలు, శీతోష్ణస్థితిలో చోటుచేసుకుంటున్న మార్పులు, పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు వివరించారు. హరిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వి. శిరీష, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ చలమల్ల వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ కృష్ణకుమార్, కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుగంటి సురేష్,ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధి నుంచి డాక్టర్ మల్లికార్జున్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం తదితరులు వివిధ అంశాలపై ప్రసంగించారు. పర్యావరణహిత కార్యకలాపాలను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఎం. ప్రవీణ మాట్లాడుతూ సదస్సు నిర్వహణకు సహకరించిన కళాశాల విద్యాశాఖ, రూసా, ఐసీఎస్ఎస్ఆర్ సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. సదస్సు విజయవంతానికి సహకరించిన అధ్యాపకులు, వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యావేత్తలు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు.సదస్సు కన్వీనర్ డాక్టర్ పి. సుజాత మాట్లాడుతూ కళాశాల విద్యాశాఖ కమిషనర్, జాయింట్ డైరెక్టర్, ఐసీఎస్ఎస్ఆర్ డైరెక్టర్, రూసా కోఆర్డినేటర్‌తో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ముగింపు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పూనమ్ కుమారి, కో-కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటేశం ఆకుల, డాక్టర్ జి. మల్లిక, షరీఫ్ మియా, డాక్టర్ విమల, డాక్టర్ మంజుశ్రీ, కరుణకుమారి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ బి.బి. రమణి, డాక్టర్ శివదీప్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సు విజయవంతానికి సహకరించిన పాత్రికేయులు, ప్రముఖులు, అతిథులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయగీతంతో సదస్సు ముగిసింది.