BREAKING
రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..? ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు అఫ్గానిస్తాన్‌తో తొలి టెస్టు: భారీ స్కోరు సాధించిన జింబాబ్వే.. భారీ ఆధిక్యంలో పర్యాటక జట్టు! బ్రిటన్ చిన్నారుల కోసం 'ఫైండ్ ఫ్రెండ్స్' ఫీచర్‌ను డిసేబుల్ చేసిన స్నాప్‌చాట్ అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఘన విజయం.. యూఏఈపై 9 వికెట్ల తేడాతో భారీ గెలుపు! శిలాజ ఇంధనాల కోత మరియు క్లైమేట్ ఫైనాన్స్‌పై ఉత్కంఠ సరికొత్త చరిత్ర సృష్టించిన హసన్ మహమూద్.. తొలి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు! నవంబర్‌లో మెరుగుపడిన యూఎస్ వినియోగదారుల సెంటిమెంట్ దండారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ 'బ్లాక్‌లిఫ్ట్' రాకెట్ కోసం ఫైర్‌ఫ్లైతో 1.3 బిలియన్ డాలర్ల డీల్ పాంచజన్య పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు

ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్‌ పాలనకు శ్రీకారం.. 350 మంది అధికారులకు శిక్షణ

Select Suryaa Now
ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్‌ పాలనకు శ్రీకారం.. 350 మంది అధికారులకు శిక్షణ
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంపొందించడంతో పాటు పాలనను మరింత వేగవంతం చేసేందుకు డిజిటల్‌ విధానాలను అమలు చేస్తున్నట్లు జిల్లా ఖజానా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌, ఈ-శాంక్షన్స్‌, వామిస్‌ మాడ్యూళ్లపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సుమారు 350 మంది అధికారులు, డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌ ఆఫీసర్లు (డీడీఓలు) పాల్గొన్నారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల సేవలు, ఆర్థిక లావాదేవీలు, అభివృద్ధి పనుల నిర్వహణలో డిజిటల్‌ విధానాలను వినియోగించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని వివరించారు. ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌ ద్వారా ఉద్యోగుల నియామకం నుంచి పదవీ విరమణ వరకు సంబంధించిన వివరాలు, పదోన్నతులు, సెలవులు, బదిలీలు తదితర సేవలను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చని తెలిపారు.అలాగే ఈ-శాంక్షన్స్‌ విధానం ద్వారా ప్రభుత్వ వ్యయాలకు సంబంధించిన నిధుల మంజూరు, బిల్లుల ప్రక్రియను డిజిటల్‌ పద్ధతిలో చేపట్టవచ్చని వివరించారు. వామిస్‌ మాడ్యూల్‌ ద్వారా ప్రభుత్వ అభివృద్ధి పనుల అంచనాలు, సాంకేతిక అనుమతులు, ఒప్పందాలు, పనుల పురోగతిని ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ఈ మూడు డిజిటల్‌ విధానాల అమలుతో కార్యాలయాల్లో ఫైళ్ల జాప్యం తగ్గడంతో పాటు పరిపాలనలో జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతాయని తెలిపారు. ఉద్యోగులకు, ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందించేందుకు ఈ విధానాలు దోహదపడతాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు, డీడీఓలు ఈ డిజిటల్‌ విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా పీఏఓ శర్మ, ఏటీఓ హైదర్‌ అలీ, ఎస్టీఓలు సాయికృష్ణ, అలివేలుమంగ, వినాయకరావు, జిల్లా ఖజానా కార్యాలయ సిబ్బంది, వివిధ ఉప ఖజానా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.