BREAKING
అక్టోబర్‌లో పుంజుకున్న కెనడా ఐవే పీఎంఐ సూచీ అయోధ్య దీపోత్సవ్‌కు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ న్యాక్ గ్రేడ్ పెంపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలి సౌరవ్ గంగూలీ పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. 'దూస్రా' మేకర్స్‌కు కీలక ఆదేశాలు ఫర్నిచర్ కొనుగోళ్లు మందగించడంతో ఐకియా అమ్మకాలు డౌన్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ డార్క్ వెర్షన్.. కరణ్ జోహార్ అలా ఎందుకు కోరుకున్నారంటే! కొవిడ్ వ్యాక్సిన్ విక్రయాలతో మోడెర్నా ఆదాయ గైడెన్స్ పెంపు షాద్ నగర్ మున్సిపాలిటీలో జోరుగా ఇంటి పన్నుల వసూలు... నెట్‌ఫ్లిక్స్‌లో విశ్వనటుడు సిద్ధార్థ్, ఫ్రైడా పింటోల 'అన్‌కస్టమ్డ్ ఎర్త్'.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్‌ పాలనకు శ్రీకారం.. 350 మంది అధికారులకు శిక్షణ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తి తగ్గింపుపై ఎలాన్ మస్క్ క్లారిటీ వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ అమెరికా స్టాక్ మార్కెట్లలో సానుకూల ప్రారంభం ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు.. జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ సంజయ్‌ జాజు ఆదేశం జనని హాస్పిటల్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ

పరిషత్ పోరులో...పోలీసులు వర్సెస్ వైసిపి

Select Suryaa Now
పరిషత్ పోరులో...పోలీసులు వర్సెస్ వైసిపి
బీహార్ ను తలపించేలా స్థానిక ఎన్నికలు 
వైఎస్ఆర్ సిపి సమన్వయకర్త డాక్టర్ గజ్జల
సత్తెనపల్లి,  న్యూస్ : పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారిని పావులను చేసి ఎన్నికలు దౌర్జన్యపూరితంగా నిర్వహించాలని, ఇది కూడా ఒక గెలుపేనా.మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..?ఇంతకన్నా కన్నా డీఎస్సీ తరహాలో ఒక జీవోను తీసుకువచ్చి వారికి సంబంధించిన వారికి పదవులు ఇవ్వచ్చు కదా. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేశారని వైయస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజల సుధీర్ భార్గవరెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన నియోజకవర్గంలో జరిగిన పరిషత్ పోరులో వైయస్సార్సీపి అభ్యర్థులపై జరిగిన దాస్టీకాలపై పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిషత్ పోరు వైయస్సార్సీపీ వర్సెస్ పోలీసు వ్యవస్థగా జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల కూటమి కుట్రల వివరాలను ఆయన వెల్లడించారు.రాజుపాలెంలో అయితే నామినేషన్లు వేయనీయకుండా టిడిపి గుండాలు రోడ్లపై కర్రతో రాళ్లతో నామినేషన్ కేంద్రానికి పోనివ్వని పరిస్థితి నేను ఎస్పీ కి, డీఎస్పీ కి, సిఐ కి, ఫోన్ చేసి మాట్లాడితే వెహికల్ అరెంజ్ చేస్తామని అన్నారు. టైం గడుస్తున్న వెహికల్ అరెంజ్ చేయని పరిస్థితి అడిగితే మీరు రాండి మేము తీసుకెళ్లి వేయిస్తాం అంటారు.పరిస్థితి చూస్తే రోడ్లపై కర్రలతో దాడి చేస్తున్న టిడిపి గుండాలు నకరికల్లులో అయితే సీసీ కెమెరాలు ఆపి వేసిన నామినేషన్లను అధికారుల వద్దకు వెళ్లి చించివేసిన టిడిపి నాయకులపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. జడ్పిటిసిగా నామినేషన్ వేసిన అభ్యర్థి భర్తను అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎస్ఐ మఫ్టీ స్టేషన్ తీసుకువెళ్లి బెదిరించి విత్ డ్రా చేయించారు. సాక్షాదారాలతో వీడియోలు డిఎస్పి కి పంపి మాట్లాడితే నేను యాక్షన్ తీసుకుంటా అన్నారు ఇంతవరకు స్పందించలేదు.సత్తెనపల్లి 12వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి పెద్దింటి గోవిందమ్మ భర్తను ఎలక్షన్ ముందు రోజు 10 గంటలకు పోలీసులు వచ్చి తీసుకువెళ్లారు. మరుసటి రోజు 5 గంటలకు విడిచిపెట్టారు. ఎలక్షన్ రోజు వారి అబ్బాయిని నలుగురు వ్యక్తులు బైకుపై కిడ్నాప్ చేశారు అందులో డుమ్ము అలియాస్ తేజ అనే వ్యక్తి ఉన్నాడు. ఇంతవరకు దానిపై స్పందించలేదు. రాజుపాలెంలో జడ్పిటిసి అభ్యర్థి నీ ఎన్నికల ముందు రోజు ఎస్ఐ వెహికల్ లో మా ఎన్నికల బూత్ ఏజెంట్ల ఇళ్లకు తీసుకువెళ్లి బెదిరించి వారి బూత్ ఏజెంట్ ధ్రువీకరణ పత్రాన్ని చించివేసిన పరిస్థితులు ఉన్నాయి.మాదల గ్రామంలో బూత్ ఏజెంట్ల నియమక ప్రక్రియ జరగకుండా అడ్డుకుంటుంటే నేను వెళ్లి మా బూత్ ఏజెంట్ల పత్రాలను అధికారులకు ఇచ్చి వారిని నియమించాము. పోలీసులు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ అని నన్ను అక్కడనుండి నరసరావుపేటకు తీసుకువెళ్లి హౌస్ అరెస్టు చేశారని ఇంత దారుణం ఎక్కడా లేదన్నారు.మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ అధికారి అయితే అధికారాన్ని దుర్వినియోగం చేశారో వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని, నేడు అడ్డదారిలో పదవులు చేపట్టిన వారు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని భార్గవ్ రెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు సహారా మౌలాలి రాజుపాలెం అధ్యక్షులు శ్రీనివాసరావు,ముప్పాళ్ల జడ్పిటిసి అభ్యర్థి ఎం శ్రీనివాసరెడ్డి, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజారప శివ నాగేశ్వరరావు ఇతర ముఖ్య నాయకులు తదితరులున్నారు.