బాలికలకు హెచ్ పీవీ టీకా..
బాలికలకు హెచ్ పీవీ టీకా..
బెజ్జంకి/మేజర్ న్యూస్:
మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం వైద్యాధికారి మాధురి పర్యవేక్షణలో 14ఏళ్లు పూర్తయి 15ఏళ్ల లోపు ఉన్న బాలికలకు హెచ్ పీవీ టీకా వేశారు.ఈ సందర్భంగా వైద్యాధికారి మాధురి మాట్లాడుతూ.మహిళల్లో పెరుగుతున్న సర్వైకల్ కేన్సర్ ను బాలికల దశలోనే అడ్డుకట్ట వేసేందుకు హెచ్ పీవీ వ్యాక్సిన్ ను ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.ప్రధానోపాధ్యాయురాలు రేవతి,వైద్య సిబ్బంది పద్మ,ఆశా కార్యకర్త వెంకటలక్ష్మి,ఉపాధ్యాయ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.(సూర్య రిపోర్టర్,భాస్కర్)