BREAKING
పాంచజన్య పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు మొదలైన యంగ్ హీరో తేజ సజ్జా పెళ్లి సందడి.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిశ్చితార్థ ఆహ్వానం! యూరప్ స్టెయిన్‌లెస్ స్టీల్ రంగం కోలుకోవడం 2027కి వాయిదా అక్టోబర్‌లో పుంజుకున్న కెనడా ఐవే పీఎంఐ సూచీ అయోధ్య దీపోత్సవ్‌కు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ న్యాక్ గ్రేడ్ పెంపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలి సౌరవ్ గంగూలీ పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. 'దూస్రా' మేకర్స్‌కు కీలక ఆదేశాలు ఫర్నిచర్ కొనుగోళ్లు మందగించడంతో ఐకియా అమ్మకాలు డౌన్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ డార్క్ వెర్షన్.. కరణ్ జోహార్ అలా ఎందుకు కోరుకున్నారంటే! కొవిడ్ వ్యాక్సిన్ విక్రయాలతో మోడెర్నా ఆదాయ గైడెన్స్ పెంపు షాద్ నగర్ మున్సిపాలిటీలో జోరుగా ఇంటి పన్నుల వసూలు... నెట్‌ఫ్లిక్స్‌లో విశ్వనటుడు సిద్ధార్థ్, ఫ్రైడా పింటోల 'అన్‌కస్టమ్డ్ ఎర్త్'.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్‌ పాలనకు శ్రీకారం.. 350 మంది అధికారులకు శిక్షణ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తి తగ్గింపుపై ఎలాన్ మస్క్ క్లారిటీ వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం

Select Suryaa Now
కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం
గుంటూరు  న్యూస్ : గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశానికి రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ఇటీవల కార్పొరేటర్లుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అనంతరం భాష్యం రామకృష్ణను కార్పొరేటర్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, గుంటూరు నగర అభివృద్ధే ధ్యేయంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పని చేయాలని సూచించారు. ప్రజాసేవను పరమావధిగా భావించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆదర్శ ప్రజాప్రతినిధులుగా సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్  కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో పాటు ఇటీవల ఎన్నికైన కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.