andhrapradesh
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు
మున్సిపల్ కమిషనర్ రాంబాబు ఆకస్మిక తనిఖీలు
సత్తెనపల్లి న్యూస్ : ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రాంబాబు హెచ్చరించారు.శుక్రవారం ఆయన
పట్టణంలో సైలు ప్రాంతాలలో హోటళ్లను దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.5 లాంతర్ల సెంటర్, మెయిన్ రోడ్, వేణుగోపాల స్వామి ఆలయం వద్ద, సాదువమ్మ హాస్టల్ ఏరియా, సంగం బజార్ ప్రాంతాల్లో షాపులు, హోటల్స్ ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హోటల్స్ లో అపరిశుభ్ర వాతావరణం ఉంటే అస్సలు సహించేది లేదని,ప్రతి ఒక్క వ్యాపారి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉండాలనిహోటల్స్ లో వంటగది శుభ్రమైన వాతావరణం ఉండాలని, వండిన ఆహారంపై , దుమ్ము, ఈగలు వాడకుండ చూడాలని.మరిగించిన వంట నూనెను మళ్ళీ మళ్ళీ వాడరాదని, తాగు నీరు శుభ్రంగా ఉండేలా చూడాలని, వంట చేసే సిబ్బంది గ్లౌజులు, క్యాప్ పెట్టుకోవాలంటూ సూచించారు.పాడైపోయిన, ఎక్స్ పైరీ అయిన సరుకులు వాడరాదన్నారు.వాడిన ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ టీ కప్పులు అస్సలు వాడరాదని స్టీల్ గ్లాసులు వాడాలన్నారు.హోటల్ ముందు చెత్త వేయకుండా డస్ట్ బిన్ పెట్టాలి.టీ స్టాల్స్ నిర్వాహకులు ప్లాస్టిక్ టీ కప్పులు వాడరాదని, వేడి నీటిలో మరిగించి గాజు గ్లాస్ లు వాడాలన్నారు.పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను ప్రజలు వినియోగించరాదన్నారు.పట్టణం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాల్సిందే అని స్పష్టం చేశారు.శానిటరీ ఇన్ స్పెక్టర్లకు, సచివాలయ సెక్రటరీలకు, క్లస్టర్ మేస్త్రీలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. రోజూ తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయనతోపాటు ఆర్ఐ సారథి మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు.