BREAKING
అయోధ్య దీపోత్సవ్‌కు హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ న్యాక్ గ్రేడ్ పెంపే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలి సౌరవ్ గంగూలీ పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు.. 'దూస్రా' మేకర్స్‌కు కీలక ఆదేశాలు ఫర్నిచర్ కొనుగోళ్లు మందగించడంతో ఐకియా అమ్మకాలు డౌన్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ డార్క్ వెర్షన్.. కరణ్ జోహార్ అలా ఎందుకు కోరుకున్నారంటే! కొవిడ్ వ్యాక్సిన్ విక్రయాలతో మోడెర్నా ఆదాయ గైడెన్స్ పెంపు షాద్ నగర్ మున్సిపాలిటీలో జోరుగా ఇంటి పన్నుల వసూలు... నెట్‌ఫ్లిక్స్‌లో విశ్వనటుడు సిద్ధార్థ్, ఫ్రైడా పింటోల 'అన్‌కస్టమ్డ్ ఎర్త్'.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్‌ పాలనకు శ్రీకారం.. 350 మంది అధికారులకు శిక్షణ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తి తగ్గింపుపై ఎలాన్ మస్క్ క్లారిటీ వరుస దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ అమెరికా స్టాక్ మార్కెట్లలో సానుకూల ప్రారంభం ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు.. జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ సంజయ్‌ జాజు ఆదేశం జనని హాస్పిటల్‌లో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ వాతావరణ మార్పులపై రెండు రోజుల జాతీయ సదస్సు

హోరాహోరీ... గెలుపు ఎవరిది..!

Select Suryaa Now
హోరాహోరీ... గెలుపు ఎవరిది..!
+ నేడే జడ్పిటిసి ఎంపీటీసీ భవితవ్యం 
గుంటూరు  న్యూస్: గుంటూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ జడ్పీటీసీల భవితవ్యం నేడు తేలనుంది. ఈనెల 5 న ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. శనివారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మండలంలోని మొత్తం 8 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సి ఆర్ డి ఏ లో కలవడం వల్ల చిన్న పలకలూరు, జొన్నలగడ్డ గ్రామాలకు ఎన్నికలు నిలిచాయి. ఈ నేపథ్యంలో చిన్న పలకలూరుల విలీనమైన దాసుపాలెం గ్రామానికి ప్రత్యేకంగా ఎంపీటీసీ స్థానాన్ని కేటాయించి అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఇరు పార్టీ నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు గెలిస్తే వారికి ఎంపీపీ పదవి వరించింది. ఎంపీటీసీ స్థానం బిసి మహిళకు రిజర్వేషన్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఓబుల నాయుడు పాలెం, గొర్లవారిపాలెం పరిధిలో ఎంపీటీసీ అభ్యర్థులకు మాత్రమే ఎంపీపీగా అర్హత లభించనుంది. ఆ రెండు గ్రామాలు బిసి లకు రిజర్వేషన్ అయినాయి. అలాగే జడ్పిటిసి బరిలో జనసేన పార్టీ తరఫున కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఓబుల నాయుడుపాలెం గ్రామానికి చెందిన చింతా సాంబశివరావు @ శివ, వైకాపా నుంచి చల్ల వారి పాలెం గ్రామానికి చెందిన ఇంటూరి అంజిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇరు పార్టీ నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం ఎంపీపీ పదవి ఓబుల నాయుడుపాలెం గ్రామానికి కేటాయించే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపీపీ తో పాటు జడ్పిటిసి కూడా గెలిస్తే రెండు పదవులు ఆ గ్రామానికి దక్కే అవకాశం ఉంది. 
ఆరవ జడ్పిటిసి ఎవరో...? గుంటూరు రూరల్ మండలంలో జడ్పిటిసి స్థానం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు మొత్తం ఐదుగురు జడ్పిటిసి గా సేవలు అందించారు. మొదటిసారిగా 1995 లో  రాతంశెట్టి సీతారామాంజనేయులు @ లాలుపురం రాముకు అవకాశం దక్కింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేసి 5,800 ఓట్లతో విజయం సాధించారు.  అనంతరం 2001లో జరిగిన జడ్పిటిసి ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాసరావు కాంగ్రెస్ తరపున 6 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. 2006లో జడ్పిటిసి స్థానం బీసీ మహిళకు కేటాయించారు. ఆ సమయంలో రెడ్డిపాలెం గ్రామానికి చెందిన మందాడి శివ పార్వతి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. రూరల్ మండలంలోని 10 మేజర్ పంచాయతీలు 2012లో సగరపాల సంస్థలో విలీనం అయినాయి. అనంతరం 2014లో జడ్పిటిసి స్థానాన్ని ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అయింది. వెంగలయపాలెం గ్రామానికి చెందిన కొలకలూరి కోటేశ్వరరావు వైకాపా తరుపున విజయం సాధించారు. మొత్తం 11 పంచాయతీల పరిధిలో ఎన్నికలు జరగా ఆయన 1906 ఓట్లతో గట్టెక్కారు. చివరగా 2021 లో జరిగిన ఎన్నికల్లో చిన్న పలకలూరు గ్రామానికి చెందిన తుమ్మల సుబ్బారావు జడ్పిటిసిగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించింది. వైకాపా తరపున సుబ్బారావు అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం జడ్పిటిసి స్థానం కూటమి జనసేన పార్టీకా...? వైకాపా కా...? అంటూ మండల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఉత్కంఠతకు తెరపడనుంది.