andhrapradesh
75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు
పెదకూరపాడు న్యూస్ : పెదకూరపాడు మండలం 75త్యాళ్ళూరు పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో సత్తెనపల్లి ఆర్.డబ్ల్యు.ఎస్ డిఇఇ మేడ శ్రీనివాస కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ-వేస్ట్ నిర్వహణ,పాత ఎలక్ట్రానిక్ వస్తువుల సేకరణ డ్రైవ్‌లు,ఈ-వేస్ట్ పునరుపయోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.విద్యార్థులచే పర్యావరణ పరిరక్షణ,సుస్థిర జీవనశైలి ప్రతిజ్ఞ చేయించారు.ఈ బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు నవంబర్ 1 నుండి 7 వరకు జరుగుతున్నాయి.ఈ కార్యక్రమంలో ఆర్.డబ్ల్యు.ఎస్ ఎ.ఇ త్రిలోక్ రెడ్డి,పీసి చైర్మన్ జీవి. హనుమంత రావు, ఉపాధ్యాయులు,విద్యార్థులు
పాల్గొన్నారు.