BREAKING
హోరాహోరీ... గెలుపు ఎవరిది..! రూ. 1.8 లక్షల కోట్లతో రోకు (Roku) సంస్థను సొంతం చేసుకున్న ఫాక్స్ కార్పొరేషన్ బాలికలకు హెచ్ పీవీ టీకా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రిఫ్రిజిరేటర్ వితరణ. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాక్సిన్ వాటర్స్ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు ప్రపంచ వాతావరణ పోరులో చైనా క్లీన్ టెక్నాలజీ విప్లవం పరిషత్ పోరులో...పోలీసులు వర్సెస్ వైసిపి హెట్రో పరిశ్రమ సహకారంతో కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం లో ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు… జగన్ హయాంలో ఎన్నికల్లో హింస.. ఇప్పుడు సిరాచుక్కలతో స్వేచ్ఛగా ఓటింగ్: ప్రత్తిపాటి పుల్లారావు టెక్సాస్ గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయనున్న టెస్లా

శ్రీ మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ

Select Suryaa Now
శ్రీ మూలస్థానేశ్వరాలయంలో ప్రదోషకాల పూజ

నెల్లూరు, కల్చరల్, మేజర్ న్యూస్   :     నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రదోషకాల పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రదోష వేళ శ్రీ నందీశ్వర స్వామికి, మూలవిరాట్ శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారికి వేదపండితులు విశేష సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.  అనంతరం సాయంత్రం వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను చిన్న వెండి నంది వాహనంపై అధిష్టింపజేశారు.  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కర్పూర హారతులు సమర్పించి, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ ఉత్సవానికి నెల్లూరు వాస్తవ్యులు పత్తి రాజేష్ ఉభయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం ఆలయ ఛైర్మన్ అజయ్, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించారు.