ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై చౌదరిగూడలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా చేపట్టిన ఈ కార్యక్రమానికి పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యావంతులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య బలోపేతానికి తోడ్పడాలని అన్నారు. పట్టభద్రులు, నిరుద్యోగులు, విద్యావంతుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి కృషి చేస్తారని తెలిపారు. ఓటరు నమోదు ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించి అర్హులందరూ ఓటర్లుగా నమోదు అయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పులికంటి భాస్కర్ రెడ్డి, చౌదరిగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల సుధాకర్, బండ్లగూడ నాగేష్ గౌడ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రావణ్ నాయక్, కళ్యాణ్ నాయక్, కాలనీవాసులు నాగరాజు, భద్ర, రఘు, తులసి తదితరులు పాల్గొన్నారు.