BREAKING
సంగారెడ్డి పట్టణ అభివృద్ధే లక్ష్యం – మౌలిక సదుపాయాలకు పెద్దపీట పిఎసిఎస్ లలో నామినేట్ వద్దు...పరోక్ష ఎన్నికలే ముద్దు.. భారతీయ శాస్త్రీయ కళలను ప్రోత్సహించాలి రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం.. కరాటే విద్యార్థులకు బెల్టు గ్రేడింగ్స్ *చీకట్లను పారద్రోలి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి*.. *సంగారెడ్డి జిల్లా ,నియోజవర్గ ప్రజలకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దీపావళి శుభాకాంక్షలు*! ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ దళితులకు కేటాయించాలి *దుకాణం బాగా నడుపు.. అమ్మను మంచిగా చూసుకో మిర్చీ దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తితో జగ్గారెడ్డి ముచ్చట* ఆళ్లగడ్డలో తెదేపా ప్రభంజనం పరిగి డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి: టిజెఎమ్‌యు పూర్వ విద్యార్థుల సన్మానం..... మా ఇందిరమ్మ ఇళ్లల్లో దీపావళి సంబరాలు విద్యావేత్త విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి...... కేటీఆర్‌ను కలిసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ బాణాసంచాలను కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి......

​ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్.. నూతన బోర్‌వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

Select Suryaa Now
​ ఎస్సీ హాస్టల్ విద్యార్థుల తాగునీటి కష్టాలకు చెక్.. నూతన బోర్‌వెల్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
బషీరాబాద్, మేజర్ న్యూస్: బషీరాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు పరిష్కారం దిశగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చర్యలు చేపట్టారు. హాస్టల్ విద్యార్థులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి నిధుల ద్వారా హాస్టల్ ప్రాంగణంలో నూతన బోర్‌వెల్ ఏర్పాటు పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే తమ ప్రాధాన్యత అని, ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తాగునీటి సమస్యను గుర్తించిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో బోర్‌వెల్ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.అనంతరం హాస్టల్ గదులు, వంటగదిని ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వసతులు, భోజన నాణ్యత, ఇతర సమస్యలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.తమ తాగునీటి సమస్యపై వెంటనే స్పందించి బోర్‌వెల్ ఏర్పాటు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి హాస్టల్ విద్యార్థులు, వార్డెన్, సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.