BREAKING
మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సడన్‌గా వాయిదా పడిన 'భోగి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్: అసలు కారణం అదేనా? పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం

ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ దళితులకు కేటాయించాలి

Select Suryaa Now
ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ దళితులకు కేటాయించాలి

 

ఆమనగల్లు రంగారెడ్డి:

ఆమనగల్లు వ్యవసాయమార్కెట్ చైర్మన్ పదవిని దళితుల కేటాయించాలని  దళిత సంఘాల నాయకులు జంతుక జానయ్య,వసుపుల సాయిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు దళితులను ఓటు బ్యాంకుగావినియోగించుకొని వారిని ముందుంచి పంచాయితీలు తీర్చుకొని మనుగడ సాగిస్తున్నారని వారు చెప్పారు. పదవుల కేటాయింపులు అణగారిన వర్గాలైన దళితులకు కేటాయించాలన్న ఆలోచన చేయకపోవడంవిచారకరమన్నారు. ఫలితంగా దళితుల అభ్యున్నతికి ఏ పార్టీ దోహదంచేయడం లేదని మండిపడ్డారు. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆమనగల్లు పట్టణానికి చెందిన వసుపుల జంగయ్య కు చైర్మన్ పదవికి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికలలో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కాశిరెడ్డి నారాయణరెడ్డి విజయానికి ఆయన అహర్నిశలు కృషిచేసిన ప్రస్తుతం వారు మౌనం పాటించడం విచారకరమన్నారు.ఇప్పటికైనా ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని దళితులకుకేటాయించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి పదవులు దక్కించుకుంటామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మైసయ్య, మల్లేష్, అల్లాజి, సురేష్, టిల్లు, లక్ష్మణ్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. 

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.