BREAKING
మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సడన్‌గా వాయిదా పడిన 'భోగి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్: అసలు కారణం అదేనా? పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం

విద్యావేత్త విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి......

Select Suryaa Now
విద్యావేత్త విశ్రాంత ఉపాధ్యాయుడు మృతి......

మద్దూర్ ......మద్దూరు మండలంలోని లద్నూర్ గ్రామానికి చెందిన విద్యావేత్త విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రతి కంఠం రామ్మూర్తి అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందారు. మృతునికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. స్థానికుల సమాచారం తో విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోన్లో కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. నిరుపేద విద్యార్థుల కోసం ఆయన చేసిన కృషిని ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి కొనియాడారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మృతుని కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. విద్యావేత్త ప్రతి కంఠం రామ్మూర్తి తను విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మందిని ప్రయోజకులను చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిజిపి పేరువారం రాములతో పాటు ఎంతోమందికి రామ్మూర్తి బడిలో పాఠాలు నేర్పి ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ పొందారు. ఉద్యోగ విరమణ అనంతరం 1996లో తన స్వగ్రామంలోని పూర్వ విద్యార్థుల సహకారంతో సూర్యనారాయణ అనే ప్రైవేటు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిన గొప్ప గురువుగా పేరొందారు. తనకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది శిష్యులు ఉన్నారు. రామ్మూర్తి చేసిన కృషిని పలువురు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మేక సంతోష్ కుమార్, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు శనిగారం సత్యనారాయణ, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి, సర్పంచ్ లు కాసర్ల రేణుక కనకరాజు, ఇట్టబోయిన కనక చంద్రం, దండే శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు పుట్ట వెంకటరమణారెడ్డి, రామడుగు బాలరాజు, ఉప సర్పంచ్ బెడద శివకుమార్, లతో పాటు పలువురు సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియల కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పూర్వ విద్యార్థులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.