BREAKING
మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సడన్‌గా వాయిదా పడిన 'భోగి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్: అసలు కారణం అదేనా? పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం

పిఎసిఎస్ లలో నామినేట్ వద్దు...పరోక్ష ఎన్నికలే ముద్దు..

Select Suryaa Now
పిఎసిఎస్ లలో నామినేట్ వద్దు...పరోక్ష ఎన్నికలే ముద్దు..

 

ఆమనగల్లు రంగారెడ్డి:

 కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం కల్పించిన రైతుల హక్కులను హరించేందుకే ప్రాథమిక సహకార సంఘాలకు కార్యవర్గాన్ని నామినేట్ చేస్తుందని కౌన్సిలర్ దుడ్డు ఆంజనేయులు యాదవ్, బిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎన్నికల ద్వారా పాలకమండలీని నిన్ను కోవాల్సి ఉండగా కేవలం ఒక్క జీవో తో నామినేటెడ్ పాలకవర్గాన్ని ఎంపిక చేయడం రైతుల హక్కులను హరించడమేనని, ఈ విషయం తీవ్ర అభ్యంతరకరమని వారు చెప్పారు.దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలు లోకి వచ్చినప్పటినుండి నేటి వరకు ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల ద్వారానే పాలకవర్గాన్ని ఎన్నిక చేయడం జరిగిందని ప్రస్తుతం   రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గ కమిటీని నియమించడం ప్రజాస్వామ్యా విరుద్ధమని   రైతుల హక్కులకు భంగం కలిగించాలని చూడడం కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నామినేటెడ్ విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ   తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.పీఏసీఎస్ లు గ్రామీణ ప్రాంత రైతులకు వెన్నుముక్క లాంటివని అలాంటి ప్రాథమిక సహకార సంఘాలను తీసివేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం  కుట్ర పన్నుతుందని ఆరోపించారు. మండలాల్లో పిఎసిఎస్ ల ఆధ్వర్యంలో రైతులకు విత్తనాలు, ఎరువులు, రుణాలు అందజేస్తు కీలకమైన సంస్థలకు రైతుల ఓటు హక్కుతో ఎన్నుకునే అవకాశం లేకుండా నామినేటెడ్ పద్ధతిలో నియమించడం రైతు వ్యతిరేక నిర్ణయమే అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రైతులు వ్యతిరేకంగా ఉన్నారనే అక్కసుతో  పీఏసీఎస్ లకు, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేదని అందుకే తాత్కాలికంగా ఆరు నెలలపాటు కొత్త కమిటీలకు అవకాశం ఇస్తున్నామని చెప్పుతూ చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. ఆరు నెలల తర్వాత మళ్లీ పొడిగిస్తారా అని ప్రశ్నిస్తూ ఇది రైతులను మోసం చేయడమే అని వారు దుయ్యబట్టారు.

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి రైతులు ఎన్నుకున్న వారికే అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సమావేశంలో కౌన్సిలర్ జగన్, నాయకులు ఖలీల్, సాయిలు,సైదులు, శ్రీశైలం తదితరులు ఉన్నారు. 

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.