రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం..
దుబ్బాక …దుబ్బాక మండల పరిధిలోని రాజక్క పేట, చికోడు, గంభీర్పూర్, బల్వంతపూర్, పద్మశాలి గడ్డ, నర్లేన్ గడ్డ, హసన్ మిరాపూర్ గ్రామలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగర రవి ముదిరాజ్, ఏ పి ఏం రామకృష్ణ, సి సి లు ఏఈఓ లతో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు.రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ధాన్యం తూకం,నాణ్యత పరిశీలన, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. వరి కోతలు పూర్తయిన వెంటనే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు.. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కడదురి నరేందర్ రెడ్డి మట్ట కిషన్ రెడ్డి చర్లపల్లి బాల్రెడ్డి పర్స నర్సింలు ఎండి అజీజు వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు.