BREAKING
మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సడన్‌గా వాయిదా పడిన 'భోగి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్: అసలు కారణం అదేనా? పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం

భారతీయ శాస్త్రీయ కళలను ప్రోత్సహించాలి

Select Suryaa Now
భారతీయ శాస్త్రీయ కళలను ప్రోత్సహించాలి

                                 మహిషాసురమర్ధిని నృత్య రూపక ప్రదర్శనలో డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి

రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ 7: భారతీయ శాస్త్రీయ కళలు, నృత్య సంప్రదాయాలను ప్రోత్సహించాలని తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ సంచాలకుడు ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ సౌజన్యంతో “నాట్య గాన సమ్మోహనం” పేరిట మహిషాసురమర్ధిని నృత్య రూపక ప్రదర్శన రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏనుగు నరసింహారెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ సంప్రదాయ కళారూపాల వైభవాన్ని చాటుతూ..కళాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నాట్య గురువులు డాక్టర్ రాధా మోహన్, మోహన్ మేకల శిష్యలు దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన ఘట్టాన్ని ప్రతిబింబించే నృత్య ప్రదర్శనను భక్తి, శక్తి, వీరత్వం, నృత్య వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీ నిర్మాత శివలింకా కృష్ణ ప్రసాద్ , సింగ్ సంగీత దర్శకుడు పార్థసారధి, ముదిగొండ అమర్నాథ శర్మ, విజయ్ కుమార్ , నిర్వాహకులు, శ్రీపతి సేవా సమితి మేనేజింగ్ ట్రస్టీ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.