కేటీఆర్‌ను కలిసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
దుండిగల్ మేజర్ న్యూస్ :కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కుక్కే సుబ్రహ్మణ్య స్వామివారి ప్రసాదాన్ని కేటీఆర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా శంభీపూర్ క్రిష్ణతో పాటు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్‌తో నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, నాయకులు, కార్యకర్తల అంశాలపై ఆత్మీయంగా చర్చించారు.
పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలతో మమేకమవుతూ పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అంశాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు.
పండుగ సందర్భంగా కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం, స్వామివారి ప్రసాదాన్ని అందజేయడం పట్ల శంభీపూర్ క్రిష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ బీఆర్ఎస్ సర్కిల్ జనరల్ సెక్రటరీ కొల్తూర్ మల్లేష్ ముదిరాజ్, పాక్స్ డైరెక్టర్ అర్కల జీతయ్య, బీఆర్ఎస్ యువ నాయకులు శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.