సంగారెడ్డి పట్టణ అభివృద్ధే లక్ష్యం – మౌలిక సదుపాయాలకు పెద్దపీట
సంగారెడ్డి;పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ తెలిపారు.సంగారెడ్డి పట్టణంలోని 9వ వార్డు సప్తగిరి కాలనీలో రూ.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, 35వ వార్డులో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు ఆమె ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీలత శ్రీశైలం, నర్సమ్మ ప్రసాద్, సంగీత మహేష్, సతీష్ రెడ్డి, వంశీ, శైలేష్ రెడ్డి, రవి నాయక్, కాంగ్రెస్ నాయకులు సురేష్, కిరణ్, రమేష్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.