BREAKING
NP కుంట వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అనురాధమ్మ ఘనవిజయం NP కుంట వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి అనురాధమ్మ ఘనవిజయం మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సడన్‌గా వాయిదా పడిన 'భోగి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్: అసలు కారణం అదేనా? పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి!

*దుకాణం బాగా నడుపు.. అమ్మను మంచిగా చూసుకో మిర్చీ దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తితో జగ్గారెడ్డి ముచ్చట*

Select Suryaa Now
*దుకాణం బాగా నడుపు.. అమ్మను మంచిగా చూసుకో మిర్చీ దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తితో జగ్గారెడ్డి ముచ్చట*

సంగారెడ్డి;సంగారెడ్డి గంజ్ మైదాన్ ప్రాంతాన్ని శనివారం జగ్గారెడ్డి పరిశీలించారు. తన కుమారుడి వివాహ వేడుక ఏర్పాట్లకు సంబంధించి... గంజ్ మైదాన్ లో చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న కళ్ళు కాంపౌండ్ లోకి వెళ్లారు. అక్కడ మిర్చీలు అమ్ముతున్న వ్యక్తితో జగ్గారెడ్డి సరదాగా ముచ్చటించారు. " గతంలో సైకిల్ పుల్లలకు మాంసం పెట్టి, సీకులు కాల్చి ఇచ్చేవారు కదా? ఇప్పుడు మటన్ సీకులు తయారు చేయడం లేదా? "అంటూ జగ్గారెడ్డి అడిగారు. ఇప్పుడు సీకులు తయారు చేయడం లేదని, మిర్చీలు అమ్ముతున్నానని ఆ చిరు వ్యాపారి చెప్పారు.*అమ్మ ఎలా వుంది అని అడిగిన జగ్గారెడ్డి*అమ్మ ఎలా ఉంది.. అంటూ ఆ చిరు వ్యాపారిని జగ్గారెడ్డి అడిగారు. దుకాణం మంచిగా అభివృద్ధి చేసుకోవడానికి కూడా సాయం చేస్తానన్నారు. ఇంతలో పక్కనున్న వ్యక్తి ఒకరు.. అమ్మను సరిగా చూసుకోమని అతడికి చెప్పండి అంటూ జగ్గారెడ్డికి సూచించారు. ఈ విషయమై స్పందించిన జగ్గారెడ్డి... *"అమ్మను మంచిగా చూసుకోవడానికి ఏం రోగం రా మీకు. ఇదిగో ఈ రూ. 10వేలు తీసుకో. దుకాణంలోకి కావాల్సిన వస్తువులు తెచ్చుకో. దుకాణం బాగా నడుపు. అమ్మను మంచిగా చూసుకో. అమ్మని పట్టించుకోవడంలేదని నాకు తెలిస్తే చెంప పగుల గొడుతా " అంటూ సుతిమెత్తగా జగ్గారెడ్డి హెచ్చరించారు.*