BREAKING
వరికొనుగోలు కేంద్రాల ప్రారంభం వైస్ చైర్మన్ జూలకంటి సురేష్ ను కలిసి ఆహ్వాన పత్రం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెట్టుబడుల జోరు దాదాపూర్‌లో నాసిరకం రేషన్‌ బియ్యం.. పురుగులు, తుట్టెలతో లబ్ధిదారుల ఆగ్రహం హోరాహోరీ... గెలుపు ఎవరిది..! రూ. 1.8 లక్షల కోట్లతో రోకు (Roku) సంస్థను సొంతం చేసుకున్న ఫాక్స్ కార్పొరేషన్ బాలికలకు హెచ్ పీవీ టీకా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రిఫ్రిజిరేటర్ వితరణ. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాక్సిన్ వాటర్స్ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు ప్రపంచ వాతావరణ పోరులో చైనా క్లీన్ టెక్నాలజీ విప్లవం

స్వర్ణగిరి కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలానికీ ఎసరు.. అధికారుల పర్యవేక్షణ ఏది..?

Select Suryaa Now
స్వర్ణగిరి కాలనీలో సెప్టిక్ ట్యాంక్ స్థలానికీ ఎసరు.. అధికారుల పర్యవేక్షణ ఏది..?
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలకే రక్షణ కరువవుతోందని పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడ స్వర్ణగిరి కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థలం పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తి ప్రహారీ గోడ నిర్మాణం పేరుతో సెప్టిక్ ట్యాంక్ స్థలంలోకి చొచ్చుకెళ్లి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కాలనీలోని కొందరు పెద్దలు, నాయకుల అండదండలతోనే సదరు నిర్మాణదారుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలం ఆక్రమణకు గురవుతున్నా అడ్డుకోవాల్సిన సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాలు జరుగుతున్న సమయంలో అధికారులు గుర్తించలేదా? లేక తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించారా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కాలనీల్లో ప్రభుత్వ, ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలను పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ, ఆక్రమణలు పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్వర్ణగిరి కాలనీలోని సెప్టిక్ ట్యాంక్ స్థలంపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు. సంబంధిత స్థలాన్ని అధికారికంగా సర్వే చేసి, ఆక్రమణలు జరిగినట్లు నిర్ధారణ అయితే అక్రమ నిర్మాణాలను తొలగించి స్థలాన్ని తిరిగి ప్రజావసరాలకు అందుబాటులోకి తీసుకురావాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.