వరికొనుగోలు కేంద్రాల ప్రారంభం
పెద్దశంకరంపేట;మండల పరిధిలోని శివాయపల్లి, బూర్గుపల్లి గ్రామాలలో ఐకెపి అధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సర్పంచ్ సంతోషి, ఐకెపి ఏపియం శకుంతలలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని, దళారులకు ధాన్యం అమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో సీసీ వీరాచారి, గ్రామకార్యదర్శులు సవిత, సిద్దు తదితరులున్నారు.06ఎన్ఆర్కె17: బూర్గుపల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం