BREAKING
ప్రతి ఇంటా దీపావళి ఆనందాల వెలుగులు నింపాలి : కలెక్టర్ డా. జి.లక్ష్మీశ డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.. ప్రశాంతంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రతి ఇంటా వెలుగులు నిండాలి టెక్కలిలో పసుపు జెండా రెపరెపలు గెలుపొందిన ఎస్.రాయవరం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి రమణమ్మ! జడ్పిటిసి గా కోట నీలవేణి విజయం టెక్కలి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం గరివిడి జడ్పిటీసి గా బొత్స పూజిత విజయం జిల్లాలో మొట్టమొదటి సారిగా వికసించిన కమలం " మెలియాపుట్టిలో టీడీపీ విజయదుందుభి ఒకే ఇంట్లో రెండు జెండాలు.. సైకిల్ స్పీడ్ కు బ్రేకు వెయ్యలేకపోయిన వైసిపి కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమిదే పై చేయి అనందపురం మండలంలో టీడీపీ జయకేతనం

దాదాపూర్‌లో నాసిరకం రేషన్‌ బియ్యం.. పురుగులు, తుట్టెలతో లబ్ధిదారుల ఆగ్రహం

Select Suryaa Now
దాదాపూర్‌లో నాసిరకం రేషన్‌ బియ్యం.. పురుగులు, తుట్టెలతో లబ్ధిదారుల ఆగ్రహం
దోమ, మేజర్ న్యూస్: ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ సన్న బియ్యం నాణ్యతపై లబ్ధిదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో శుక్రవారం రేషన్‌ షాపు ద్వారా పంపిణీ చేసిన సన్న బియ్యంలో పురుగులు, తుట్టెలు ఉండటంతో పాటు అధికంగా నూకలు రావడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తినడానికి కూడా పనికిరాని స్థితిలో ఉన్న బియ్యాన్ని పంపిణీ చేయడంపై రేషన్‌ డీలర్‌ను నిలదీశారు. ఇలాంటి బియ్యాన్ని తీసుకెళ్లి ఎలా వండుకుని తినాలని ఆవేదన వ్యక్తం చేశారు.పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు ఆరోపించారు. రైస్‌ మిల్లర్ల నిర్లక్ష్యం, అధికారుల బాధ్యతారాహిత్యం కారణంగా పేదలకు నాణ్యమైన బియ్యం అందడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా దోమ మండల బీఆర్ఎస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గురుచరణ్ గౌడ్ మాట్లాడుతూ.. రేషన్‌ బియ్యంలో పూర్తిగా తుట్టెలు, నూకలు, పురుగులు ఉండటంతో అవి తినడానికి పనికిరాకుండా ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై రేషన్‌ డీలర్‌ను ప్రశ్నించగా, పైనుంచి వచ్చిన బియ్యాన్నే పంపిణీ చేస్తున్నామని సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని, నాసిరకం బియ్యం సరఫరాకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బియ్యం నాణ్యతా లోపాలపై గ్రామస్థులు తహసీల్దార్ రవీందర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ మాట్లాడుతూ.. గ్రామస్థుల ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే నాణ్యమైన రేషన్ బియ్యం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేదలకు పంపిణీ చేసే రేషన్‌ బియ్యం నాణ్యత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే స్పందించాలని, నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.