BREAKING
వైస్ చైర్మన్ జూలకంటి సురేష్ ను కలిసి ఆహ్వాన పత్రం అందజేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బారావు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పెట్టుబడుల జోరు దాదాపూర్‌లో నాసిరకం రేషన్‌ బియ్యం.. పురుగులు, తుట్టెలతో లబ్ధిదారుల ఆగ్రహం హోరాహోరీ... గెలుపు ఎవరిది..! రూ. 1.8 లక్షల కోట్లతో రోకు (Roku) సంస్థను సొంతం చేసుకున్న ఫాక్స్ కార్పొరేషన్ బాలికలకు హెచ్ పీవీ టీకా.. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 75త్యాళ్ళూరు పిఎం శ్రీ హైస్కూల్లో బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రిఫ్రిజిరేటర్ వితరణ. హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాక్సిన్ వాటర్స్ కార్పొరేటర్ల ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణకు సత్కారం యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి.. పరిశ్రమలతో కలిసి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి: ఎంపీ ఈటల రాజేందర్ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే చర్యలు తప్పవు ప్రపంచ వాతావరణ పోరులో చైనా క్లీన్ టెక్నాలజీ విప్లవం పరిషత్ పోరులో...పోలీసులు వర్సెస్ వైసిపి

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి.. - అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం

Select Suryaa Now
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలి.. -  అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం

 

సూర్య - పెద్దపల్లి రూరల్ : వి.బి.జి. రామ్ జీ పథకంలో 100 శాతం పనులు అమలు చేయడంతో పాటు జాబ్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని అడిషనల్ డీఆర్డీఓ మల్లేశం అధికారులకు సూచించారు. కూలీలకు వేతనాలు సకాలంలో అందించాలని, పనులు జరిగే ప్రదేశాల్లో తాగునీరు, నీడ తదితర కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పెద్దపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదికలో 17వ విడత ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు జరిగిన ఉపాధి హామీ పనుల ఖర్చుల వివరాలను అధికారులు వెల్లడించారు.
సామాజిక తనిఖీ నివేదిక ప్రకారం మండలంలో మొత్తం 622 పనులు చేపట్టగా, వేతనాల రూపంలో రూ.5,09,63,567, మెటీరియల్ రూపంలో రూ.31,63,472 ఖర్చు చేశారు. మొత్తంగా రూ.5,41,27,039 వ్యయం జరిగినట్లు వెల్లడించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఒక పనికి రూ.1,96,859 ఖర్చు కాగా, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 41 పనులకు రూ.2,61,31,303 వ్యయం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అలాగే పంచాయతీరాజ్ పనులకు సంబంధించిన నేమ్ బోర్డుల ఏర్పాటు లో  అలసత్వం కు 16 వేలు , ఉపాధి హామీ పనులకు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.4,600 జరిమానా విధించినట్లు అడిషనల్ డీఆర్డీఓ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి బావ్ సింగ్, హెచ్‌ఆర్ రమేష్, ఎంపీడీఓ కొప్పుల శ్రీనివాస్, ఏపీవో రమేష్ బాబు, జూనియర్ క్యూసీ హరికృష్ణ, జేఈ రాజయ్య, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.