BREAKING
సంప్రదాయ కుమ్మరి కళాకారులకు చేయూత తాగునీటిని వృథా చేస్తే కఠిన చర్యలు జలమండలి అధికారుల పిలుపు వెలిమెలలో తాగునీటి సమస్యకు పరిష్కారం నేషనల్ ఫుట్బాల్ గేమ్ సెలెక్ట్ అయిన గిరిజన విద్యార్థిని శైలజ ప్రజా సమస్యలపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి క్షేత్రస్థాయి పర్యటన విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. అర్హులైన ఓటర్లకు ఎన్నికల సంఘం మరో అవకాశం.! కోహెడ నూతన డ్యూప్యూటీ తహసీల్దార్ రాకేష్ 25 రోజులుగా హిందీ క్లాసులు జరగలేదు…సర్పంచ్ కి విద్యార్థులు వినతి పత్రం… కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ యువకుల పాదయాత్ర.… మహమ్మద్ షమీ ఎఫెక్ట్: మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్.. ఓటముల్లోనూ హీరోగా.. లెక్కలకు అందని విదేశీ లెగసీ! కూరెళ్ల అంగన్వాడీ హెల్పర్(ఆయా) కమలమ్మ కుటుంబానికి పది లక్ష ఎక్స్ గ్రేషియాను ఇవ్వాలి ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి

అక్రమ నిర్బంధాలు, దాడులపై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

Select Suryaa Now
అక్రమ నిర్బంధాలు, దాడులపై విచారణ జరిపి రీపోలింగ్ నిర్వహించాలి: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు.  కలెక్టరేట్, మేజర్ న్యూస్ :    పరిషత్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీకి అనుకూలంగా ఉపయోగించుకుందని నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీతో కాకుండా, పోలీసు వ్యవస్థతోనే తమ పార్టీ పోరాడాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.  నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కాకాణి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్నికల నిబంధనలను పట్టించుకోకుండా పలు ప్రాంతాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ పోలింగ్ ఏజెంట్లను ముందస్తుగా పోలీస్ స్టేషన్లకు తరలించి నిర్బంధించారని, ఫోన్లు తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డారని విమర్శించారు.

పోలీస్ స్టేషన్లలో ఏజెంట్ల నిర్బంధం :  ఎన్నికల అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందిన తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ల వివరాలను సేకరించి, ముందురోజు రాత్రే వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారని కాకాణి ఆరోపించారు. పొదలకూరు మండలం చెన్నారెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను స్టేషన్లలో నిర్బంధించి ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాలరాసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయంటూ ఆరోపణ :  ముత్తుకూరు, వెంకటాచలం ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు జరిగినట్లు కాకాణి తెలిపారు. ముత్తుకూరులో ఓటరు గుర్తింపు కార్డు అడిగినందుకు దినేష్ అనే బూత్ ఏజెంట్‌పై దాడి చేశారని, వెంకటాచలంలో గాయపడిన కార్యకర్త పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలోనూ దాడి జరిగినట్లు ఆరోపించారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని విమర్శించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లారంటూ విమర్శ  :  ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించి తమ పార్టీ ఏజెంట్లను బయటకు పంపించారని కాకాణి ఆరోపించారు. ఆత్మకూరు, సర్వేపల్లి, కావలి, ఉదయగిరి, కందుకూరు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఆనం రామనారాయణరెడ్డి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడంపై ప్రశ్నలు లేవనెత్తారు. మాజీ ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి విషయంలో అధికారులు వ్యవహరించిన తీరును కూడా తప్పుబట్టారు.

పోలీసులే రిగ్గింగ్‌కు సహకరించారన్న ఆరోపణలు  :  గూడూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్ బి. గురవయ్య ఇంటిపై దాడికి యత్నించారని కాకాణి పేర్కొన్నారు. మర్రిపాడు మండలం తిక్కవరంలో ఎస్సై బలరాంరెడ్డి తమ పార్టీ ఏజెంట్‌ను బయటకు పంపించి, టీడీపీ వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. పెళ్లకూరులోనూ పోలీసు అధికారులు తమ పార్టీ ఏజెంట్లను బయటకు పంపించి రిగ్గింగ్‌కు సహకరించారని విమర్శించారు.

రీపోలింగ్ నిర్వహించి కౌంటింగ్ నిలిపివేయాలి  :  జిల్లాలో జరిగిన ఎన్నికల ఉల్లంఘనలు, దాడులకు సంబంధించిన వీడియో ఆధారాలను కలెక్టర్, ఎస్పీలకు అందజేసినట్లు కాకాణి వెల్లడించారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్ ఫుటేజీలను పరిశీలించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారణ అయిన కేంద్రాల్లో ఎన్నికలను రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని కోరారు.

ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం కల్పించాలి :  ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని కాకాణి పేర్కొన్నారు. అవసరమైతే ఎన్నికలను మరో రోజు నిర్వహించి, అనంతరం కౌంటింగ్ చేపట్టాలని సూచించారు. ఎన్ని బెదిరింపులు, దాడులు ఎదురైనా ఎన్నికల్లో పోరాడిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.