ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండల జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పూజల శ్రీనివాసరావు గెలుపొందారు. సమీప వైసీపీ అభ్యర్థి పులఖండం రామకృష్ణారెడ్డిపై 4192 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పూజల శ్రీనివాసరావు స్వగ్రామం కొణికి గ్రామం. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పూజల శ్రీనివాసరావును అభినందించారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానీబాష, ఇంకొల్లు.