BREAKING
మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సడన్‌గా వాయిదా పడిన 'భోగి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్: అసలు కారణం అదేనా? పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం

సంప్రదాయ కుమ్మరి కళాకారులకు చేయూత

Select Suryaa Now
సంప్రదాయ కుమ్మరి కళాకారులకు చేయూత

                             హెచ్‌ఎండీఏ ఉద్యోగులకు దీపావళి కానుకగా రంగురంగుల మట్టి ప్రమిదలు

హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి):దీపావళి పండుగను పురస్కరించుకుని హెచ్‌ఎండీఏ ఉద్యోగుల్లో పండుగ సంతోషాలను పంచడంతో పాటు సంప్రదాయ కుమ్మరి కళాకారుల జీవనోపాధికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ రంగురంగుల మట్టి ప్రమిదల బాక్సులను ఉచితంగా పంపిణీ చేసింది.
నవంబర్ 7న అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ కార్యాలయంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ తరఫున జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (జనరల్), కార్యదర్శి (ఎఫ్‌ఏసీ) శ్రీ శ్రీవత్స కోటా, ఐఏఎస్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
స్థానిక కళాకారులకు ప్రోత్సాహం
ఈ కార్యక్రమం కోసం హైదరాబాద్‌లోని తెల్లాపూర్‌కు చెందిన కుమ్మర మహిళా సంఘం తయారు చేసిన అందమైన రంగురంగుల మట్టి ప్రమిదలను కొనుగోలు చేశారు. తద్వారా సంప్రదాయ మట్టి ప్రమిదల తయారీపై ఆధారపడి జీవిస్తున్న మహిళా కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. హెచ్‌ఎండీఏలోని అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమిదల బాక్సులను పంపిణీ చేసి ప్రతి ఒక్కరినీ దీపావళి వేడుకల్లో భాగస్వాములను చేశారు.
పాల్గొన్న ఉన్నతాధికారులు
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ (సీఎంసీ, జీహెచ్‌ఎంసీ, ల్యాండ్ పూలింగ్) యశ్వంత్ రావు, డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ (మేడ్చల్, ఘట్‌కేసర్, ఎల్‌ఆర్‌ఎస్) కె. వికాస్, హుమ్టా మేనేజింగ్ డైరెక్టర్ బి. జీవన్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సంప్రదాయ కళలకు ప్రోత్సాహమే లక్ష్యం
ఉద్యోగుల మధ్య స్నేహభావం, ఐక్యత, పరస్పర సహకారాన్ని పెంపొందించడంతో పాటు స్థానిక కళాకారుల సంప్రదాయ వృత్తులకు అండగా నిలవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని హెచ్‌ఎండీఏ స్పష్టం చేసింది. మట్టి ప్రమిదల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కూడా ప్రాధాన్యతనిచ్చింది. చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ సంపద, సానుకూలత, శుభారంభాలకు సంకేతమని ఈ సందర్భంగా గుర్తుచేసింది.
ఉద్యోగులందరికీ ఒకే విధంగా పండుగ కానుక అందించడం పట్ల హెచ్‌ఎండీఏ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మెట్రోపాలిటన్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉద్యోగుల మధ్య ఐక్యత, సోదరభావం, సంస్థ పట్ల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సంప్రదాయ కళాకారులకు ప్రోత్సాహాన్నిచ్చే మంచి కార్యక్రమంగా నిలిచింది.