నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం
నగరం, మేజర్ న్యూస్:
నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు గెలుపు పొందిన అభ్యర్థులను ఎన్నికల అధికారి కె. సత్యనారాయణ శనివారం ప్రకటించారు. పూడివాడ సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి కాసాని నెల్లిమ్మ 647 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అల్లపర్రు సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ బాబు గుంటూరు 1712 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏలేటిపాలెం సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి ఉప్పాల యానాదమ్మ 908h ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ధూళిపూడి (నార్త్) సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి ఆలూరి వెంకటేశ్వరరావు 812 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. చినమట్లపూడి సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి అబ్దుల్ జలీల్ 820 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బోరమాదిగపల్లి సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి కొక్కిలిగడ్డ హరిబాబు 34 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అద్దంకివారిపాలెం సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి దుర్గాభవాని ఉయ్యూరు 1099 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెద్దవరం సెగ్మెంట్ జనసేన పార్టీ అభ్యర్థి గోపాలకృష్ణమ్మ గోపరాజు 823 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెదపల్లి సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి శొంఠి శ్రీనివాసరావు 1351 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెదమట్లపూడి సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి పాగోలు శ్రీనివాసరావు 1230 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మంత్రిపాలెం సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి ప్రతాప్ వసంతం 1741 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కొలగానివారిపాలెం సెగ్మెంట్ టిడిపి అభ్యర్థి గుంటూరు శ్రీదేవి 963 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నగరం సెగ్మెంట్ అభ్యర్థి మోర్ల స్వరూపరాణి 2133 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈదుపల్లి సెగ్మెంట్ జనసేన పార్టీ అభ్యర్థి కళ్యాణి చింతల 1599 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.