BREAKING
మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సడన్‌గా వాయిదా పడిన 'భోగి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్: అసలు కారణం అదేనా? పాములపాడు జెడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి వేల్పుల జైపాల్ ఘన విజయం 678 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి రాచపూడి సురేష్‌పై గెలుపు గాండ్లపెంట మండల వైసిపి జడ్పిటిసి రోహిణి ఘన విజయం ఫ్లాప్ సినిమాను 100 రోజులు ఆడించిన అభిమానులు: ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే! జైలులో ఉండి వైకాపా జెడ్పీటీసీ విజయం సాధించారు రాత్రివేళల్లో అక్రమ మొరం తవ్వకాలు, యథేచ్ఛగా రవాణా : ప్రభుత్వ ఆదాయానికి గండి : దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'లో బిగ్ ట్విస్ట్: విలన్ పాత్రలో క్రేజీ నటుడు.. వేణు యెల్దండి ప్లాన్ ఇదే! కౌన్సిలర్ల చొరవతో డబిల్‌పూర్‌లో తీరనున్న తాగునీటి సమస్యలు ధనాపురం–హొన్నంపల్లి ఎంపీటీసీగా రాజగోపాల్ విజయం ఫీజుల బకాయిలు ఇవ్వకుంటే రాష్ట్రం రణరంగమే.. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య చిట్టమూరులో కూటమిదే విజయం..! జడ్పీటీసీతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో 8 కైవసం.. వైసీపీకి నాలుగు స్థానాలు రావణాసురుడి పాత్రను తిరస్కరించిన రెబల్ స్టార్ ప్రభాస్: అసలు విషయం బయటకి! యూసుఫ్‌గూడ ‘రాణి క్రాకర్స్’ స్టాల్‌లో సినీ డాన్స్ మాస్టర్ నటరాజ్ సందడి నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం

మెడికల్ షాపులపై సస్పెన్షన్లు ఎత్తివేయాలి

Select Suryaa Now
మెడికల్ షాపులపై సస్పెన్షన్లు ఎత్తివేయాలి

                        కెమిస్టుల సమస్యలను కూన శ్రీశైలం గౌడ్ దృష్టికి తీసుకెళ్లిన అసోసియేషన్ ప్రతినిధులు

జీడిమెట్ల మేజర్ న్యూస్ : డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల అనంతరం మెడికల్ షాపులపై విధించిన నిరవధిక సస్పెన్షన్లతో కెమిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మేడ్చల్ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 

అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు యరమాద హరి నారాయణ ఆధ్వర్యంలో ప్రతినిధులు షాపూర్‌నగర్‌లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల డ్రగ్స్ కంట్రోల్ శాఖ అధికారులు మెడికల్ షాపులపై నిర్వహించిన తనిఖీలు, అనంతరం పలు షాపులకు విధించిన నిరవధిక సస్పెన్షన్ల కారణంగా కెమిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనల అమలుతో పాటు తమకు ఎదురవుతున్న సమస్యలను అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. కెమిస్టుల సమస్యలను కూన శ్రీశైలం గౌడ్ సానుకూలంగా విన్నారు.

 ఈ విషయాన్ని ప్రభుత్వం, సంబంధిత మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మెడికల్ షాపుల నిర్వాహకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు బ్రహ్మానందం, ముక్తార్ అలీ, కృష్ణ గౌడ్, మధు గౌడ్, మొహమ్మద్ షాకీర్, ప్రభాకర్ గౌడ్, సంతోష్ గౌడ్, నరేష్ గౌడ్, సునీల్ గౌడ్, అభిరామ్ గౌడ్, ప్రదీప్ గౌడ్, శేఖర్ గౌడ్, ప్రవీణ్, రాము, సంగమేష్, నవీన్, అశోక్, షాజహాన్, పవన్ గౌడ్, రాజశేఖర్, శ్రీధర్ గుప్తా, శ్రీధర్, రాజు, విక్రమ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.