ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి..
మద్దూర్ ..…ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి లు కోరారు. దూల్మిట్ట మండలంలో ని దూల్మిట్ట, జాలపల్లి, లింగాపూర్, తోర్నాల, బెక్కల్, కొండాపూర్, బైరాన్ పల్లి, మద్దూరు మండలంలోని మర్మాముల గ్రామాలలో పిఎసిఎస్, ఐకెపిల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలలో రైతులు దళారులను నమ్మి మోసపోకుండా గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్రభుత్వం కల్పించే మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించి లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ సీఈవో బోయిని శ్రీధర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, పిఎసిఎస్ డైరెక్టర్లు, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పిఎసిఎస్ స్టాఫ్ అసిస్టెంట్ వజ్జల ఉపేందర్, సిబ్బంది ఎర్ర బచ్చల విజేందర్, వివో ఏలు, వివో అధ్యక్షురాలు, సెంటర్ నిర్వాహకులు, హమాలీ కార్మికులు రైతులు తదితరులు పాల్గొన్నారు.