దత్తాత్రేయ స్వామి, లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు
నిజాంపేట్ మేజర్ న్యూస్ :గానుగాపూర్‌లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం, బీదర్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలను నిజాంపేట్‌కు చెందిన నాయకులు శనివారం భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గానుగాపూర్‌లోని నది సంగమం వద్ద గంగా హారతిలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ దత్తాత్రేయ స్వామివారి పాదపూజ, పల్లకి సేవ, హారతిపూజలను నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు కుటుంబ సభ్యులు, ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గానుగాపూర్ పుణ్యక్షేత్రంలో పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అనంతరం బీదర్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.
నిజాంపేట్ గ్రామ మాజీ సర్పంచ్ వడ్ల నగేష్ చారి, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కోఆప్షన్ సభ్యుడు తలారి వీరేష్ ముదిరాజ్‌తో పాటు సీనియర్ నాయకులు చిలువేరు ప్రభాకర్ రెడ్డి, ముక్క దేవేందర్ గుప్తా, రఘునాథ్ తదితరులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీదర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ పూజారులు వారికి స్వామివారి ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలను అందించారు. రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పూజలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతత పొందామని నాయకులు తెలిపారు.