BREAKING
ఇందిరమ్మ ఇళ్లును ప్రాంభించిన ఎంల్ఏ రోహిత్ రావు దలేర్ మెహందీపై అభిజీత్ భట్టాచార్య వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన కుమారుడు గుర్‌దీప్! దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి.. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా చూస్తాం: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాత్రికేయులపై దౌర్జన్యం * సెల్‌ఫోన్లు లాక్కొన్నా చర్యల్లేవా? * టీడీపీ మున్సిపల్ చైర్మన్ త్రివేంద్ర నాయుడుకు ఘన సన్మానం బిగ్‌బాస్ సరికొత్త చరిత్ర.. అరవై రోజుల్లోనే వంద కోట్ల గంటల వ్యూయర్‌షిప్‌తో రికార్డు! కోటబొమ్మాళి వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి పందుల పెంపకందారుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలి.. సమస్యలపై సానుకూలంగా స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ టైగర్ ష్రాఫ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.. ఫైరింగ్ ఘటన తర్వాత కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడన్న విద్యుత్ జమ్వాల్! నేడు పలాస డివిజన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు పాచిపెంట వెలుగు కార్యాలయంలో దస్త్రాలు పరిశీలన సీఐఐ సదస్సు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన స్పెషల్ సీఎస్ ఎస్.ఎస్. రావత్ ఘనంగా శ్రీ ధన్వంతరి నారాయణ జయంతి వేడుకలు. సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పటిష్ట ఏర్పాట్లు ఆదిపురుష్ VS రామాయణం.. రెండు భారీ పురాణ చిత్రాల మధ్య ప్రధాన తేడాలు ఇవే!

టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర.

Select Suryaa Now
టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర.

తిరుమల మేజర్ న్యూస్,

భక్తుల సేవ, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రాధాన్యత

టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్‌గా టీటీడీ ఈవో  ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఛైర్మన్‌కు వేదాశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర శ్రీవారి ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ, దేవుని సేవ చేసేందుకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.ప్రస్తుతం టీటీడీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా, మెరుగైన రీతిలో కొనసాగించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ మనసును పూర్తిగా స్వామివారిపై లగ్నం చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను టీటీడీ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. భక్తులకు అన్ని విధాలా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ నిర్వహిస్తున్న ఇతర 64 ఆలయాల్లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.టీటీడీ నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారిని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా, సేవాభావం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలోని వైద్యశాలలకు వచ్చే రోగులకు ఆధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. భక్తులకు సౌకర్యాలు, ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్య, వైద్య రంగాల్లోనూ మరింత విస్తృతంగా సేవలందించడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జేఈవో (ఆరోగ్యం&విద్య) ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు

వెంకటరాజు, తిరుమల.